బాబుకు రివర్స్: గంగుల బాటలోనే శిల్పా, కారణమిదే, భూమా వల్లే వారిద్దరూ టిడిపికి గుడ్ బై

Posted By:
Subscribe to Oneindia Telugu

నంద్యాల:ఊహించినట్టుగానే మాజీమంత్రి శిల్పామోహన్ రెడ్డి టిడిపికి గుడ్ బై చెప్పారు.కర్నూల్ జిల్లాలో మరో టిడిపి నేత బాబుకు షాక్ ఇచ్చారు. వీరిద్దరూ కూడ భూమా కుటుంబం కారణంగానే టిడిపిని వీడారు.అయితే టిడిపిని వీడిన ఈ ఇద్దరు నేతలు కూడ వైసీపీ వంచన చేరారు. టిడిపి అనుసరించిన ఆపరేషన్ ఆకర్ష్ వికటించి వైసీపీ కలిసివస్తోంది.2014 ఎన్నికలకు ముందు టిడిపిలో చేరిన గంగుల ప్రభాకర్ రెడ్డి, శిల్పా మోహన్ రెడ్డిలు టిడిపికి గుడ్ బై చెప్పారు. వైసీపీలో చేరారు.

2014 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి టిడిపిలో చేరారు. ఆ ఎన్నికల్లో ఆయన నంద్యాల అసెంబ్లీ స్థానం నుండి పోటీచేసి వైసీపీ అభ్యర్థి భూమా నాగిరెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు.

మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీని వీడిని భూమా నాగిరెడ్డి టిడిపిలో చేరారు.అయితే భూమా నాగిరెడ్డి టిడిపిలో చేరడాన్ని శిల్పా సోదరులు తీవ్రంగా వ్యతిరేకించారు.అయితే పార్టీ అవసరాలరీత్యా భూమా చేరిక అనివార్యమని బాబు శిల్పాకు తేల్చిచెప్పారు.

ఈ ఏడాది మార్చిలో భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మరణించాడు. దీంతో భూమా నాగిరెడ్డి కూతురు అఖిలప్రియను చంద్రబాబునాయుడు మంత్రివర్గంలోకి తీసుకొన్నారు. అయితే నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల విషయంలో టిడిపి నాయకత్వం స్పష్టమైన హమీ ఇవ్వలేదు. దీంతో టిడిపిని వీడనున్నట్టు శిల్పామోహన్ రెడ్డి ప్రకటించారు. అయితే 2014 ఎన్నికల ముందు టిడిపిలో చేరిన గంగుల ప్రభాకర్ రెడ్డి కూడ టిడిపిని వీడి వైసీపీలో చేరారు. ఆయన వైసీపీలో చేరిన వెంటనే ఎమ్మెల్సీ పదవిని ఆ పార్టీ కట్టబెట్టింది.

టిడిపికి రివర్సైన ఆపరేషన్ ఆకర్ష్

టిడిపికి రివర్సైన ఆపరేషన్ ఆకర్ష్

2014 ఎన్నికల ముందు, తర్వాత టిడిపి కొనసాగించిన ఆపరేషన్ ఆకర్ష్ ఆ పార్టీని ఎదురు దెబ్బతీస్తోంది. పార్టీలో పాత, కొత్త నాయకుల మద్య సమన్వయం లేకపోవడంతో పాటు కొత్తగా వచ్చిన వారి పెత్తనం పెరిగిపోవడం లాంటి పరిణామాలతో కొందరు నాయకులు పార్టీలో ఇమడలేని పరిస్థితులు నెలకొన్నాయి.దీనికితోడు ఆయా నాయకుల రాజకీయభవితవ్యంపై నీలినీడలు కమ్ముకొంటున్న నేపథ్యంలో అనివార్య పరిస్థితుల్లో కొందరు నాయకులు పార్టీని వీడుతున్నారు. ఆళ్ళగడ్డ నియోజకవర్గానికి చెందిన గంగుల ప్రభాకర్ రెడ్డి, నంద్యాలకు చెందిన శిల్పా మోహన్ రెడ్డిలు పార్టీ మారడానికి ప్రధాన కారణం ఇదేనని పార్టీలో చర్చ సాగుతోంది.అయితే అందరు నాయకులను సంతృప్తిపర్చేందుకు కొంత సమయాన్ని బాబు కోరుతున్నారు. అయితే రాజకీయ భవితవ్యం దృష్ట్యా కొందరు నాయకులు పార్టీని వీడుతున్నారని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.

గంగుల బాటలోనే శిల్పా... కారణమిదే

గంగుల బాటలోనే శిల్పా... కారణమిదే

ఆళ్ళగడ్డి నియోజకవర్గానికి చెందిన గంగుల ప్రభాకర్ రెడ్డి గత ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా బరిలో నిలిచారు.అయితే ఎన్నికలకు రెండు రోజుల ముందే రోడ్డు ప్రమాదంలో వైసీపీ అభ్యర్థి శోభానాగిరెడ్డి మరణించారు.అయినా ఎన్నికలు నిర్వహించారు.ఈ ఎన్నికల్లో శోభా నాగిరెడ్డి విజయం సాధించారు.అయితే ఆమె మరణించినందున మరోసారి ఎన్నికలను నిర్వహించారు. ఆ సమయంలో సంప్రదాయం ప్రకారంగా ఈ స్థానంలో టిడిపి తన అభ్యర్థిని బరిలో నిలుపలేదు.దీంతో గంగుల పోటీచేయలేదు. దరిమిలా భూమా అఖిలప్రియ ఈ స్థానంలో విజయం సాధించారు. ఏడాదిన్నర క్రితం భూమా నాగిరెడ్డి తన కూతురితో కలిసి టిడిపిలో చేరారు. భూమా కుటుంబానికి గంగుల కుటుంబానికి మొదటి నుండి ఫ్యాక్షన్ గొడవలున్నాయి. దీంతో భూమా టిడిపిలో చేరడంతో గంగుల ప్రభాకర్ రెడ్డి టిడిపిని వీడి వైసీపీలో చేరారు. భూమాకు, శిల్పా మోహన్ రెడ్డికి కూడ రాజకీయంగా విబేధాలున్నాయి.రాజకీయంగా తన ఆధిపత్యాన్ని గండికొట్టేందుకు భూమా ప్రయత్నిస్తోన్నందున శిల్పా టిడిపిని వీడారు. అంతేకాదు ఉప ఎన్నికల్లో టిక్కెట్టు కేటాయింపు విషయంలో కూడ తాత్సారం చేయడం కూడ మరో కారణంగా శిల్పా చెబుతున్నారు.

పార్టీలు మారిన అభ్యర్థులు వారే

పార్టీలు మారిన అభ్యర్థులు వారే

మూడేళ్ళలో రాజకీయాల్లో పరిస్థితులు మారిపోయాయి. 2014 ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీని వీడి టిడిపిలో చేరారు శిల్పా మోహన్ రెడ్డి . ఆ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా నంద్యాల నుండి పోటీచేశారు. అయితే భూమా నాగిరెడ్డి వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. భూమా కుటుంబం టిడిపిలో చేరడంతో త్వరలో జరిగే నంద్యాల ఉప ఎన్నికల్లో ఆయన వైసీపీ తరపున పోటీచేసేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారు. ఈ టిక్కెట్టు కేటాయింపు విషయంలో చంద్రబాబునాయుడు తాత్సారం చేయడం వల్లే శిల్పా మోహన్ రెడ్డి వైసీపీ గూటికి చేరాలని నిర్ణయం తీసుకొన్నారు. అయితే 2014 ఎన్నికల్లో ఆయన టిడిపి అభ్యర్థిగా పోటీచేశారు. మూడేళ్ళ తర్వాత జరిగే ఉప ఎన్నికల్లో ఆయన వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. మరోవైపు 2014 ఎన్నికల్లో ఈ అసెంబ్లీ స్థానం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించిన భూమా నాగిరెడ్డి టిడిపిలో చేరారు. ఆయన అకాల మరణంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో భూమా కుటుంబం నుండి భూమా బ్రహ్మనందరెడ్డి నంద్యాల నుండి బరిలో దిగే అవకాశం ఉంది.

భూమా కారణంగానే టిడిపిని వీడిని ఇద్దరు కీలకనేతలు

భూమా కారణంగానే టిడిపిని వీడిని ఇద్దరు కీలకనేతలు

ఏడాదిన్నర క్రితం భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు అఖిలప్రియ వైసీపీని వీడి టిడిపిలో చేరారు. అయితే భూమా నాగిరెడ్డి కుటుంబంతో పొసగని ఇద్దరు కీలక నేతలు టిడిపిని వీడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.గంగుల ప్రభాకర్ రెడ్డి, శిల్పా మోహన్ రెడ్డిలకు రాజకీయంగా భూమా కుటుంబంతో వైరం ఉంది. గంగుల కుటుంబంతో భూమా కుటుంబానికి ఫ్యాక్షన్ గొడవలున్నాయి.భూమా టిడిపిలో చేరడంతో గంగుల, శిల్పా మోహన్ రెడ్డిలు తట్టుకోలేకపోయారు.భూమా నాగిరెడ్డిని పార్టీలో చేర్చుకోవడాన్ని చివరినిమిషం వరకు అడ్డుకొన్నారు. కానీ, వారి ప్రయత్నాలు ఫలించలేదు. భూమా కారణంగా పార్టీలో ఇమడలేని పరిస్థితులు నెలకొనడంతో గంగుల ప్రభాకర్ రెడ్డి మూడుమాసాల క్రితం టిడిపిని వీడి వైసీపీలో చేరారు. మరోవైపు తాజాగా శిల్పామోహన్ రెడ్డి కూడ టిడిపికి గుడ్ బై చెప్పారు. ఆయన కూడ వైసీపీలో చేరనున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Silpa Mohan reddy will join in Ysrcp on june 14. Tdp chief Chandrababu naidu didn't assured to Silpa Mohan Reddy ticket allocation for Nandhyal by elections.
Please Wait while comments are loading...