మేం ఈతరం వాళ్లం, ఓల్డ్ చంద్రబాబుకు హోదా గురించి తెలియదు: జగన్

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసన సభ సమావేశాలు హాట్ హాట్‌గా కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు ప్రత్యేక హోదా విషయమై మాట్లాడుతున్నారు.

ప్రత్యేక హోదా కోసం ఏం చేస్తారో ఎక్కడా చెప్పలేదన్నారు. నోట్‌లో లేని విషయాలు, అర్ధ సత్యాలు, అబద్దాలతో బండలు వేశారన్నారు. ప్రతి విషయంలో తన పైన బండలు వేస్తున్నారన్నారు. నాడు కిరణ్ కుమార్ రెడ్డి సర్కారును టిడిపి కాపాడిందని ఆరోపించారు. చంద్రబాబు వల్లే కిరణ్ సర్కారు ఆనాడు నిలబడిందన్నారు.

అవిశ్వాసం నోటీసు వెనక్కి తీసుకోవడంపై వివరణ ఇస్తూ... అవిశ్వాసం నోటీసు ఎవరు ఇచ్చారనే విషయం ముఖ్యం కాదని, నోటీసుకు ఎందరు మద్దతిస్తున్నారని అడిగినప్పుడు లేచి నిలబడటం ముఖ్యమని చెప్పారు. తమకు కనీసం 50 మంది మద్దతు లేకున్నా పలుమార్లు నోటీసులు ఇచ్చామన్నారు.

Chandrababu don't know about Special status: YS Jagan

లోకసభలో 19 రోజులకు గాను తాము 5 సార్లు అవిశ్వాస నోటీసులు ఇచ్చామని, కానీ ఒక్కసారి కూడా మా అవిశ్వాస తీర్మానం అనుమతించలేదన్నారు. మొత్తంగా ఈ అంశంపై 14 సార్లు తీర్మానం ఇచ్చామన్నారు. వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నాలు చేయవద్దని కోరారు.

జగన్‌కు యనమల కౌంటర్

లోక్‌పాల్ బిల్లు నేపథ్యంలో తాము అవిశ్వాసం నోటీసును వెనక్కి తీసుకున్నామని జగన్ చెప్పారు. దీనిపై యనమల రామకృష్ణుడు స్పందిస్తూ... లోక్‌పాల్ బిల్లుకు, అవిశ్వాస తీర్మానానికి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. లోక్‌పాల్ బిల్లు కారణంగా అవిశ్వాసం వెనక్కి తీసుకున్నామని చెప్పడం విడ్డూరమన్నారు. అవిశ్వాసాన్ని వెనక్కి తీసుకున్నారని ఆయన అంగీకరించారన్నారు.

హైదరాబాద్ లాంటి నగరాన్ని దూరం చేసుకున్నాం

ఐటీలో సహా అన్ని రంగాల్లో హైదరాబాద్ పైన సీమాంధ్రులు ఆధారపడి ఉన్నారని, అలాంటి హైదరాబాదును మన నుంచి దూరం చేస్తున్న సమయంలో ప్రత్యేక హోదా హామీ ఇచ్చారన్నారు. హైదరాబాద్ లాంటి నగరాన్ని దూరం చేసుకోవడం వల్ల మనకు ఇబ్బందులు వచ్చాయన్నారు. అందుకే హోదా అన్నారు.

రాష్ట్రం విడిపోవడానికి ఎవరు కారణమో ప్రజలకు తెలుసునని చెప్పారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చారని, టీవీలు, గోడల పైన రాతలు కనిపించాయన్నారు. ప్రత్యేక హోదా తెస్తానని బాబు చెప్పారన్నారు. బిజెపి కూడా ఐదేళ్లు కాదు, పదేళ్లు హోదా కావాలని డిమాండ్ చేసిందని గుర్తు చేశారు.

మేం ఇవ్వాల్టి జనరేషన్.. బాబు గత జనరేషన్

జగన్ మాట్లాడుతుండగా.. టిడిపి సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మేం ఇవ్వాల్టి జనరేషన్, చంద్రబాబు గత జనరేషన్ అన్నారు. మేం (ఈ జనరేషన్) హోంవర్క్ చేస్తామని, డాక్యుమెంట్లు చూపిస్తామని జగన్ అన్నారు.

చంద్రబాబు స్టడీ చేయరు, ఆయనకు అంత ఓపిక కూడా లేదన్నారు. మేం ఈ తరం వాళ్లం, చంద్రబాబు పాత తరం వారు ఆయనకు అన్నీ తెలియదని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రికి కూడా ప్రత్యేక హోదా గురించి పూర్తిగా తెలియదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+