వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేవాన్ష్ బర్త్ డే: టిటిడికి చంద్రబాబు భారీ విరాళం, లోకేష్ హ్యాపీ ట్వీట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: తన మనవడి పుట్టిన రోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.20 లక్షల విరాళం ఇచ్చారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, బ్రాహ్మిణిల కొడుకు పేరు దేవాన్ష్.

మరోవైపు, లోకేష్ కూడా ట్వీట్ చేశారు. దేవాన్ష్‌కు ఏడాది పూర్తయిందని, నిన్ను చూస్తుంటే టైం అలా గడిచిపోతోందని, హ్యాపీ బర్త్ డే అంటూ ట్వీట్ చేశాడు.

మనవడు దేవాన్ష్‌కు తాత బాలకృష్ణ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. దేవాన్ష్‌తో దిగిన ఒక ఫొటోను ఈ సందర్భంగా పోస్ట్ చేశారు. కాగా, ఈ రోజు సాయంత్రం హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో దేవాన్ష్ వేడుకలు నిర్వహించనున్నారు.

దేవాన్ష్ గత ఏడాది జన్మించారు. దీంతో ఇటు నారా వారి కుటుంబంలో, అటు నందమూరి బాలకృష్ణ కుటుంబంలో సంబరాలు అంబరాన్ని అంటాయి.

Chandrababu donates Rs 20 lakh on Devansh Birth day

రాజకీయాలతో బిజీగా ఉంటున్న చంద్రబాబు గత ఏడాది చివర్లో మాట్లాడుతూ... నవ్యాంధ్ర ఏపీగా రోజుకు పద్దెనిమిది గంటలు పని చేస్తున్నానని, కనీసం మనవడితో ఆడుకోలేకపోతున్నానని చెప్పారు. మనవడితో ఆడుకోవాలని మనసు తహతహలాడుతోందన్నారు. అయినా వీలు చిక్కడం లేదన్నారు. ప్రజా జీవితంలో కొన్ని త్యాగాలు తప్పవని చెప్పారు.

అంతకుముందు, నవంబర్ నెలలో చంద్రబాబు సొంతూరు నారావారిపల్లెలో దేవాన్ష్‌కు తలనీలాల తీయించారు. కులదైవం నాగాలమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కుల దైవమైన నాగాలమ్మ తల్లికి తన మనవడు దేవాన్ష్‌ పుట్టెంట్రుకలను సమర్పించారు.

Chandrababu donates Rs 20 lakh on Devansh Birth day

ఈ కార్యక్రమానికి నారా, నందమూరి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. చంద్రబాబు నారావారిపల్లె పర్యటన సందర్భంగా నాగాలమ్మ గుడి వద్ద అధికారులు చలవ పందిళ్లను ఏర్పాటు చేశారు. నారా కుటుంబంతో పాటు ఆయన బావమరిది నందమూరి బాలకృష్ణ కుటుంబం కూడా ఒకేసారి ఆనాడు గ్రామానికి రావడంతో నారావారిపల్లెలో సందడి వాతావరణం నెలకొంది.

English summary
AP CM Chandrababu Naidu donates Rs 20 lakh on Devansh Birth day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X