'జైట్లీ ప్రకటనపై డబుల్ స్టాండ్: రక్తం మరిగింది, బాబు నిన్న అలా.. నేడు ఇలా'
హైదరాబాద్: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గత పార్లమెంటు సమావేశాల్లో చేసిన ప్రకటనకు, నిన్న (బుధవారం రాత్రి) చేసిన ప్రకటనకు తేడా లేదని, అయనా సీఎం చంద్రబాబుకు నాడు రక్తం మరిగిందని, ఇప్పుడు మాత్రం అర్ధరాత్రి ప్రెస్ మీట్ పెట్టి స్వాగతించారని ఇదేమిటని వైసిపి ఎమ్మెల్యేలు మండిపడ్డారు.
అసెంబ్లీ: 'జగన్! ఇదేం పద్ధతి, అందర్నీ సస్పెండ్ చేయండి', హక్కుంది కానీ.. టిడిపి నేత
గురువారం నాడు వైసిపి ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర రెడ్డి తదితరులు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు. చంద్రబాబు తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం జైట్లీ ప్రకటనను స్వాగతించారన్నారు.
అసెంబ్లీ సమావేశాల సమయంలో అర్ధరాత్రి స్వాగతించడం ఎందుకో చెప్పాలని ఎమ్మెల్యేలు నిలదీశారు. చంద్రబాబు కేంద్రంతో లాలూచీ పడ్డారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసు భయంతో ఆయన జైట్లీ ప్రకటనను స్వాగతించారన్నారు.

ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు అని, ప్రత్యేక ప్యాకేజీ మాత్రం టిడిపి నేతల కోసమేనని విమర్శించారు. హోదా కోసం రెండుసార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపామని, అలాంటిది చంద్రబాబు రాత్రి పూట కేంద్రమంత్రి ప్రకటనను ఎలా స్వాగతిస్తారని ప్రశ్నించారు.
ఏపీ భగ్గు: తగ్గిన చంద్రబాబు, జగన్ 'బంద్'పై సొంత పార్టీలో అసంతృప్తి
నాడు టిడిపి నేతలు ఇలా..
పార్లమెంటులో జైట్లీ చేసిన ప్రకటన పైన తెలుగుదేశం పార్టీ నేతలు దూకుడుగా మాట్లాడారని అభిప్రాయపడ్డారు. చిత్తూరులో గాలి ముద్దుకృష్ణమ నాయుడు మాట్లాడుతూ.. హోదా ఇవ్వకుంటే బీజేపీ నేతలను ఏపీలో అడుగు పెట్టనివ్వమని చెప్పారని గుర్తు చేశారు. విజయవాడలో బోండా ఉమ మాట్లాడుతూ.. బీజేపీతో విడాకులు తీసుకుంటామని చెప్పారు.
చంద్రబాబు నాడు అలా నేడు ఇలా
చివరకు చంద్రబాబు కూడా నాడు పార్లమెంటులో జైట్లీ ప్రకటనను చూసి తన రక్తం మరిగిందని చెప్పారని, కానీ నిన్నటి జైట్లీ ప్రకటనను మాత్రం స్వాగతించారన్నారు. నాడు సభలో, నిన్న చేసిన ప్రకటనకు తేడా ఏముందో చెప్పాలన్నారు. చంద్రబాబు ఏపీ ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టారన్నారు.












Click it and Unblock the Notifications