బెజవాడ ఇంట్లోకి చంద్రబాబు కాలు: వెంటనే వాన, చుట్టుముట్టిన వివాదం

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో ముఖ్యమంత్రి నివాసంలోకి చంద్రబాబు అడుగు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీసమేతంగా ఈ ఇంట్లోకి అడుగుపెట్టారు. గుంటూరు జిల్లా ఉండవల్లి సమీపంలో కృష్ణా నది కరకట్టను ఆనుకొని ఉన్న లింగమనేని గ్రూపునకు చెందిన అతిథి గృహాన్ని సీఎం నివాసంగా అధికారులు సర్వహంగులతో తీర్చిదిద్దారు.

ఆదివారం సాయంత్రం 4 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబు నేరుగా రోడ్డుమార్గంలో ఈ ఇంటికి చేరుకున్నారు. చంద్రబాబు ఇంటికి చేరుకున్న కొద్దిసేపటికే భారీ వర్షం కురిసింది. ఇకపై విజయవాడలో ఉన్నన్ని రోజులూ ఆయన ఈ ఇంట్లోనే ఉండనున్నారు.

Photos: వైజాగ్‌లో చంద్రబాబు

Chandrababu enters his residence at Vijayawada

ఇంటి పనులు జరుగుతుండగానే మంచి రోజు అన్న ఉద్దేశంతో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఆగస్టు 29న ఈ ఇంట్లో పాలు పొంగించిన విషయం విదితమే. ఆ తర్వాత ముఖ్యమంత్రి దంపతులు ఈ ఇంట్లోకి రావడం ఇదే తొలిసారి. ఈ ఇంట్లో అధికారులు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇంటి వద్ద, పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

కాగా, ఆ అతిథి గృహాన్ని అక్రమంగా నిర్మించారనే ఆరోపణలు వస్తున్నాయి. అక్రమంగా నిర్మించిన నివాసంలోకి చంద్రబాబు ఎలా వెళ్తారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. దానిపై సాక్షి మీడియా ఓ కథనాన్ని కూడా ప్రచురించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+