కర్ణాటకలో దారుణం, ఏపీపై కన్ను: బీజేపీపై చంద్రబాబు ఫైర్, జగన్ పార్టీ మౌనమెందుకో?
అమరావతి: కర్ణాటకలో రాజకీయ పరిస్థితి దారుణంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. శనివారం సాయంత్రం యడ్యూరప్ప ప్రభుత్వం బలనిరూపణ పరీక్ష ఎదుర్కొనున్న నేపథ్యంలో చంద్రబాబు ఈ విషయంపై స్పందించారు.
మెజార్టీ లేకున్నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ బీజేపీ గవర్నర్‌ను కోరడం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్నికల్లో నీతులు చెప్పిన బీజేపీ.. ఇప్పుడు చేస్తున్నదేమిటని నిలదీశారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేయడం సరికాదన్నారు.

కర్ణాటకలో రాజకీయ పార్టీలు రాజ్యాంగబద్దంగా ముందుకు నడవాలని అన్నారు. బీజేపీ అప్రజాస్వామిక విధానాలతో ప్రభుత్వాన్ని కొనసాగించాలనుకుంటోందని అన్నారు. మెజార్టీ లేకున్నా అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తోందని మండిపడ్డారు.
తమిళనాడులో చేసిన కుట్రలను కర్ణాటకలో చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రం కన్నుపడిందని అన్నారు. శాంతి భద్రతల విషయంలో కుట్రలు చేస్తే మక్కెలిరగ కొడతామని హెచ్చరించారు. కర్ణాటక పరిణామాలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు స్పందించడం లేదని చంద్రబాబు ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications