ఆదివాసీలను వేధిస్తున్న జగన్ సర్కార్ .. పోలవరం నిర్వాసితులు, బాక్సైట్ తవ్వకాలతో ముడిపెట్టి చంద్రబాబు ధ్వజం
రాష్ట్రంలో సందర్భం ఏదైనా వైసీపీ సర్కార్ ను టార్గెట్ గా చేసి విమర్శలు గుప్పించడం పనిగా పెట్టుకున్న చంద్రబాబు నాయుడు తాజాగా మరోమారు ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా జగన్ సర్కార్ ను టార్గెట్ చేశారు. మొన్నటికి మొన్న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ హయాంలో చేనేత కార్మికులకు సంక్షేమ ఫలాలు అందించామని, టీడీపీ హయాంలో నేతన్నలకు స్వర్ణయుగమని పేర్కొన్న చంద్రబాబు, వైసిపి హయాంలో చేనేతలు చీకటి రోజులను చూస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేతన్నలకు ఇవ్వాల్సిన రాయితీలను తగ్గించి వైసీపీ ప్రభుత్వం చేనేతను చిన్నచూపు చూస్తోందని, నేతన్నలను దారుణమైన పరిస్థితుల్లోకి నెడుతోందని, నేతన్నల దుర్భర పరిస్థితులను చూస్తే తన మనస్సు కలచివేస్తోంది అని చంద్రబాబు పేర్కొన్నారు.

ఆదివాసీలకు వైసీపీ సర్కార్ అన్యాయం చేస్తోందన్న చంద్రబాబు
ఇక తాజాగా ఆదివాసి దినోత్సవం సందర్భంగా, ఆదివాసీలకు వైసీపీ సర్కార్ అన్యాయం చేస్తోందని వారిని వేధిస్తోందని నిప్పులు చెరిగారు. పోలవరం నిర్వాసితులలో ఆదివాసీలను వైసీపీ ప్రభుత్వం వేధిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈరోజు ఆదివాసి దినోత్సవం సందర్భంగా ట్విట్టర్ వేదికగా ప్రపంచ ఆదివాసి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో పోలవరం నిర్వాసితుల లోని ఆదివాసీలను వైసీపీ ప్రభుత్వం అణువణువునా వేధిస్తోందని విమర్శలు గుప్పించారు. పరిహారం చెల్లించకుండా బలవంతంగా ఇళ్లను ఖాళీ చేయిస్తూ నిలువ నీడ లేకుండా చేస్తోందని నిప్పులు చెరిగారు చంద్రబాబు.

పోలవరం నిర్వాసిత ఆదివాసీలకు పరిహారం ఇవ్వకుండానే ఇళ్ళు ఖాళీ చేయిస్తున్నారని ఆరోపణ
రాష్ట్రంలో పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లింపు విషయంలో కేంద్రం తమకు సంబంధం లేదని స్పష్టం చేయడంతో, పోలవరం నిర్వాసితుల పరిహార వ్యవహారం ఏపీలో దూరంగా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఏపీ సర్కార్ పోలవరం నిర్వాసితులకు, ముఖ్యంగా ఆదివాసీ బిడ్డలకు ఎలాంటి పరిహారం చెల్లించకుండా వారి ఇళ్లను బలవంతంగా ఖాళీ చేస్తున్నారంటూ చంద్రబాబు ఆదివాసీ దినోత్సవం నాడు ఆదివాసీల అన్యాయం జరుగుతోందని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.

బాక్సైట్ తవ్వకాలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం గిరిజనుల భవితవ్యాన్ని కాల రాస్తోందన్న టీడీపీ అధినేత
అంతేకాదు విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం గిరిజనుల భవితవ్యాన్ని కాల రాస్తోందని చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా విశాఖ మన్యంలో లాటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వకాలను వైసీపీ ప్రభుత్వం చేస్తోందని తెలుగుదేశం పార్టీ ఆందోళనలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు ఈ వ్యవహారంలో జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించగా ఇటీవల జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ బాక్సైట్ తవ్వకాలపై, అక్రమ మైనింగ్ వ్యవహారంపై, అడవుల్లో చెట్ల నరికివేతపై విచారణ కమిటీని ఏర్పాటు చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

బాక్సైట్ తవ్వకాలకు ముడి పెడుతూ వైసీపీ మైనింగ్ మాఫియా అంటూ చండ్ర నిప్పులు
విశాఖ మన్యంలో అక్రమ మైనింగ్ వ్యవహారంలో మావోయిస్టు పార్టీ సైతం లేఖను విడుదల చేసింది. గిరిజన బిడ్డలను అణచివేసే, వారి భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేసే బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకించాలని, అల్లూరి రామరాజు వారసులుగా మరో పితూరి కి సిద్ధం కావాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అంతేకాదు ఏపీలో కొనసాగుతున్న అక్రమ మైనింగ్ కు వ్యతిరేకంగా ఈ నెల 10వ తేదీన రాష్ట్ర వ్యాప్త బంద్ కు కూడా పిలుపునిచ్చారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా చంద్రబాబు బాక్సైట్ తవ్వకాలను లింక్ పెడుతూ బాక్సైట్ తవ్వకాలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం గిరిజనుల భవితవ్యాన్ని కాలరాస్తుందని గిరిజన సంఘాలు ఫిర్యాదు చేసినా , ఎన్జీటీ వద్దన్నా వైసిపి మైనింగ్ మాఫియా చేస్తున్న దోపిడి ఆగడం లేదని పేర్కొన్నారు.

మైనింగ్ అక్రమాలు ఆపి, ఆగిపోయిన గిరిజన పథకాలు అందించాలని డిమాండ్
అంతేకాదు ఏపీలో గిరిజన సంక్షేమం, అభివృద్ధి కోసం తెలుగుదేశం హయాంలో ప్రవేశపెట్టిన ఏ ఒక్క పథకము ఇప్పుడు అమలులో లేదని చంద్రబాబు పోస్ట్ చేశారు. గిరిజన రిజర్వేషన్ల జీవో 3 రద్దు పై ప్రభుత్వ స్పందన లేదని చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇప్పటికైనా మన్యంలో మైనింగ్ అక్రమాలను ఆపేందుకు, ఆగిపోయిన గిరిజన సంక్షేమ పథకాలను కొనసాగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
-
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
కర్ణాటకలో సంచలన తీర్పు: నిర్లక్ష్యంపై సీరియస్.. -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!!












Click it and Unblock the Notifications