రాతియుగం కోసం జగన్ వైపు వెళతారా.. స్వర్ణయుగం కోసం చంద్రబాబుతో వస్తారా!!

వైసీపీ పాలనలో రాష్ట్రం ధ్వంసమైందని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఐదేళ్లలో యువత నిరుద్యోగులుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి ఎన్నికల తర్వాత అందరి కష్టాలు తీరతాయని చెప్పారు. ఆళ్లగడ్డ బహిరంగ సభలో చంద్రబాబు సీఎం జగన్‌పై సెటైర్లు వేశారు. ''జగనన్న వదిలిన బాణం ఇప్పుడు ఎక్కడ తిరుగుతుందో చూస్తున్నారని ఎద్దేవా చేశారు.

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో నిర్వహించిన 'రా.. కదలిరా..' బహిరంగ లో చంద్రబాబు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. ఎక్కడ చూసినా విధ్వంసక పాలన కొనసాగుతుందన్నారు . నంద్యాల జిల్లాలో ఈసారికి ఏడు నియోజకవర్గాల్లో కచ్చితంగా టిడిపి పార్టీ గెలుస్తుందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ అంటే నమ్మి అందరూ ఓటేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ ముఖ్యమంత్రి వై. జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశారన్నారు.

Chandrababu fires on ys jagan rule made shocking comments

టిడిపి ప్రభుత్వ హయాంలో నంద్యాల జిల్లాలో నందికొట్కూరుకు రూ.650 కోట్లతో మెగా సీడ్‌ పార్క్‌ తేవాలనుకున్నామన్నారు. ఎమ్మిగనూరులో టెక్స్‌టైల్‌ పార్కును అటకెక్కించారు. ఓర్వకల్లుకు 15 నెలల్లోనే విమానాశ్రయం తెచ్చామన్నారు. 6 మెగావాట్లతో సోలార్‌ పార్క్‌ తెచ్చేందుకు ప్రయత్నించామన్నారు. రాయలసీమలో అన్ని వనరులు ఉన్నాయని, సీమలో నీటిపారుదల ప్రాజెక్టులు మొదలుపెట్టింది ఎన్టీఆర్‌. ఇక్కడ నీరు ఉంటే పంటలు బాగా పండుతాయన్నారు .

రాయలసీమలో స్థానిక వనరులు వాడుకుంటే బయటకు వెళ్లి పనిచేసే అవసరం లేదు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా అలగనూరుకు మరమ్మతులు చేస్తాం. జగన్మోహన్ రెడ్డి వచ్చాక సీమకు ఒక్క ప్రాజెక్టు అయినా వచ్చిందా? ప్రాజెక్టులపై మేం ఖర్చు చేసిన దానిలో 20 శాతం కూడా జగన్‌ ఖర్చు చేయలేదు. జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌ అన్నారు.. ఇచ్చారా?మెగా డీఎస్సీ అన్నారు.. ఒక్క నోటిఫికేషన్‌ ఇవ్వలేదన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ వేధింపులతో అమరరాజా, జాకీ కంపెనీలు వెనక్కి వెళ్లిపోయాయి. తిరుపతిని ఆటోమొబైల్‌ హబ్‌గా చేయాలని అనేక కంపెనీలను తెచ్చాం. కియా పరిశ్రమను తెచ్చిన ఘనత మాదే. వైకాపా పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడ్డారన్నారు. ఐదేళ్లలో మీ జీవితాల్లో ఏదైనా మార్పు వచ్చిందా? అని ప్రశ్నించారు. జగన్‌ మాయమాటలు నమ్మి మరోసారి ప్రజలు ఎవరు నమ్మొద్దు అన్నారు. ప్రజలు ఈసారి తెదేపా ప్రభుత్వానికి పట్టం కడుతున్నారని చెప్పారు.

వాళ్ల ఇంట్లో గొడవలకు ఏపీ రాజకీయాలకు సంబంధం ఏంటి ? అని ప్రశ్నించారు . బాబాయ్ వివేకానందరెడ్డిని హత్యచేసి అనేక డ్రామాలు ఆడారు. విచారణ జరగకుండా సీబీఐపై కేసులు పెట్టారన్నారు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డిని చంపింది షర్మిలే అని వారు ఆరోపించినా ఆశ్చర్యం లేదు'' అని వ్యాఖ్యానించారు. రాతియుగం కోసం జగన్ వైపు వెళతారో.. స్వర్ణయుగం కోసం నాతో వస్తారో ప్రజలే తేల్చుకోవాలని సూచించారు. అనర్హులను అందలం ఎక్కించి బాధలు పడుతున్నారని వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+