హజ్ యాత్ర: చేయి ఊపి బాబు వీడ్కోలు (పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిలో అన్ని హంగులతో హజ్ హౌస్‌ను నిర్మించనున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల ముస్లింల పవిత్ర హజ్ యాత్ర బృందానికి నాంపల్లి హజ్‌హౌస్ వద్ద బుధవారం కానుకలను బహూకరించి జెండా ఊపి ఆయన వీడ్కోలు పలికారు.
మైనారిటీల్లో పేదరికాన్ని రూపుమాపడానికి తమ ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తుందన్నారు. వారికి ఆంధ్రప్రదేశ్ మైనారిటీ కమిషనర్ మహ్మద్ ఇక్భాల్ స్వాగతం పలుకారు. మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
హజ్ కమిటీ ప్రత్యేకాధికారి ప్రొఫెసర్ ఎన్‌ఎ.షుకూర్, మైనారిటీ సంక్షేమశాఖ కార్యదర్శి ఉమర్ జలీల్, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ప్రకాష్‌గౌడ్, మాజీ మంత్రి ఎన్‌ఎండీ ఫరూఖ్ పాల్గొన్నారు.

ఎపి హజ్ హౌస్ వద్ద బాబు
పవిత్ర హజ్ యాత్రకు బయలుదేరిన ముస్లిం సోదరులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇలా...

జెండా ఊపి...
ముస్లిం సోదరుల హజ్ యాత్రను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జెండా ఊపి ప్రారంభించారు.

ముస్లిం సోదరులతో బాబు
పవిత్ర హజ్ యాత్రను ప్రారంభిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముస్లిం సోదరులతో ముచ్చటించారు.

ముస్లిం సోదరులకు వీడ్కోలు..
పవిత్ర హజ్ యాత్రకు బయలుదేరిన ముస్లిం సోదరులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీడ్కోలు పలికారు.

అన్ని హంగులతో..
తమ ప్రభుత్వం ముస్లిం సోదరుల సంక్షేమానికి కట్టుబడి ఉందని నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. అన్ని హంగులతో ఎపిలో హజ్ హౌస్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

చేయి ఊపి..
పవిత్ర హజ్ యాత్రకు బయలుదేరిన ముస్లిం సోదరులకు చేయి ఊపుతూ నారా చంద్రబాబు నాయుడు వీడ్కోలు చెప్పారు.












Click it and Unblock the Notifications