పెద్దిరెడ్డి అడ్డాలో నిఘా, చంద్రబాబు ఆదేశాలతో రికార్డు రూమ్ లకు గట్టి బందోబస్తు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలుచోట్ల ఫైళ్లు కాల్చేస్తున్నారు. గత ఐదేళ్లలో తాము చేసిన తప్పులు బయటపడకుండా ఉద్యోగులు, నేతలు కుమ్మక్కై ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. తాజాగా మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం రాత్రి మంటలు చెలరేగి ఆ కార్యాలయంలోని కీలక రికార్డులు కాలి బూడిద అయిపోయాయి.

ఈ ఘటనను సోమవారం పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఇది ప్రమాదం కాదని స్పష్టంచేశారు. ఎవరో ఉద్దేశపూర్వకంగా కాల్చేశారని, దీనివెనుక పెద్ద కుట్ర ఉన్నట్లు అర్థం అవుతోందని డీజీపీ ద్వాకరా తిరుమలరావు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం విహిస్తున్న మదనపల్లె సమీపంలోని పుంగనూరు నియోజక వర్గంలోని ప్రభుత్వ రికార్డుల భద్రత అంశం తెరపైకి రావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

చంద్రబాబు, డీజీపీ దెబ్బ, పోలీసు కస్టడీలో ఇద్దరు ఆర్డీఓలు, పెద్దిరెడ్డికి షాక్

Chandrababu Govt arranged police security for Punganur Tehsildar office

పుంగనూరు జమీందారీ పాలన కాలానికి చెందిన విలువైన రెవెన్యూ ఆస్తుల రికార్డులున్న పుంగనూరు పట్టణంలోని రికార్డు గది భద్రతపై ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. పూర్వపు తాలూకా కేంద్రమైన పుంగనూరు నుంచే నాటి జమీందారులు పాలన సాగించి అనేక చెరువులు, ఆలయాలు నిర్మించి ఆకాలంలోనే అభివృద్ధి పనులు చేశారు. పుంగనూరు జమీందారీల అధీనంలో వేల ఎకరాల్లో భూములు ఉండేవి.

కోట్లాది రూపాయల విలువైన భూములు, ఆస్తులకు చెందిన రికార్డులన్నీ 1948 నుంచి పుంగనూరులోని రాతిమసీదు వీధిలోని తహసీల్దారు కార్యాలయంలోని రికార్డు గదిలో భద్రపరిచారు. రెవెన్యూ రికార్డులు ఎఫ్‌ఎల్‌ఆర్‌, ఎస్‌ఎల్‌ఆర్‌, వ్యవసాయ పొలాలు, ఇళ్లస్థలాలు, పొరంబోకు, సెటిల్‌మెంట్‌ భూములు, అడవుల పత్రాలు, దేవదాయశాఖ, వక్ఫ్‌బోర్డు భూములు, భూసేకరణ, చెరువులు, వంకలు, కుంటలు, తదితర ముఖ్యమైన విలువైన రికార్డులు అన్ని అదే కార్యాలయంలో భద్రపరిచారు.

పుంగనూరు జమీందారీ పాలనకు సంబంధించిన ప్రాంతాలకు చెందిన భూములు వివరాలన్నీ అందులోనే ఉన్నాయి. గతంలో గ్రామసేవకులు, తహసీల్దార్‌ కార్యాలయాల్లో రాత్రి డ్యూటీలు చేస్తూ ఆ కార్యాలయానికి కాపలాగా ఉండేవారు. కొంతకాలంగా వీఆర్‌ఏలు ఆ పనులు చేయడంలేదని ఆరోపణలు ఉన్నాయి. పుంగనూరులో గతంలో రాతిమసీదు వీధిలో పూర్వం నుంచి సొంత భవనంలో తహసీల్దారు కార్యాలయం ఉండేది.

Chandrababu Govt arranged police security for Punganur Tehsildar office

గత ఏడాది చివరలో పుంగనూరు అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద (మదనపల్లె రహదారి సమీపంలో) ఎంపీడీవో కార్యాలయ స్థలంలో మండల పరిషత్‌ భవనం, అదే భవనంపైన తహసీల్దార్‌ కార్యాలయాలు నిర్మించి తహసీల్దార్‌ కార్యాలయాన్ని నూతన భవనంలోకి మార్చారు. కానీ అధికారుల నిర్లక్ష్యం, అవగాహనరాహిత్యం వల్ల తహసీల్దార్‌ కార్యాలయంలో ప్రధానమైన రికార్డు గదిని నిర్మించలేదు. దీంతో పాత కార్యాలయంలోనే విలువైన రికార్డులు అక్కడే ఉన్నాయి.

కొత్త భవనంలో తహసీల్దార్‌ కార్యాలయం నిర్వహిస్తున్నారు. ఏ ముఖ్యమైన రికార్డు కావాలన్నా పాత కార్యాలయానికి వెళ్లాల్సివస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. విలువైన రికార్డులున్న గదికి పగలు, రాత్రి కాపలా ఏర్పాటు చేయలేదు. రికార్డు గది వెనుక ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా తలుపులు అధ్వాన్నంగా ఉన్నాయి. భద్రతలేదని అంటున్న ప్రజలు ఆ గదిలోని రికార్డులపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగిన తరువాత అలర్ట్ అయిన పోలీసులు పుంగనూరు పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయంలోని రికార్డులు ఉన్న గది దగ్గర భద్రత ఏర్పాటు చేశారు. మదనపల్లె డీఎస్పీ ఆదేశాల మేరకు ఆ ప్రాంతంలో పోలీసులను పెట్టారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదంప పెద్దిరెడ్డి అనుచరుల హస్తం ఉందని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న సమయంలో ఆయన సొంత నియోజక వర్గంలోని పుంగనూరులో ప్రభుత్వ రికార్డులు ఉన్న గదికి బందోదబస్తు ఏర్పాటు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+