ఏపీ రైతులకు తీపికబురు చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఏపీలోని ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుంది. ముఖ్యంగా రైతాంగ సంక్షేమం కోసం పనిచేస్తున్నామని చెబుతున్న కూటమి ప్రభుత్వం తాజాగా రైతులకు మేలు చేసే ఒక పథకానికి సంబంధించి నిధులను విడుదల చేస్తుంది. ఖరీఫ్ సీజన్ కు సంబంధించి పంట బీమా పథకం కోసం 132 . 58 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది కూటమి ప్రభుత్వం.

పంట నష్టాల నుంచి ఉపశమనం
రైతులకు ఆర్థిక భద్రతను అందించడానికి, వారికి పంట నష్టాల నుంచి ఉపశమనం కలిగించడానికి ఈ నిర్ణయం తీసుకున్న ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఈ మేరకు నిధులను విడుదల చేసింది. ఇక ఇదే విషయాన్ని టిడిపి తమ అధికారిక ఎక్స్ ఖాతాలో పేర్కొంది.

Chandrababu govt said good news to ap farmers

నిధులు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
ఖరీఫ్ సాగుకు సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటా అయిన 50 శాతం మొత్తాన్ని ముందస్తు ప్రీమియం గా చెల్లించడం కోసం రెడీ అయిన కూటమి ప్రభుత్వం దీనికి సంబంధించిన నిధులను విడుదల చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతాంగానికి మేలు జరగనుంది

పంటల బీమా పథకంతో రైతులకు మేలు
దీనివల్ల పంట బీమా పథకాలను రైతులకు సకాలంలో అందజేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పంటల బీమా పథకం వల్ల రైతన్నలకు మేలు కలుగుతుంది. ఈ విధానం కారణంగా పంట నష్టం జరిగినప్పుడు రైతులకు ఆర్థిక సహాయం అందుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2008 నుంచి గ్రామం ఒక ఇన్సూరెన్స్ యూనిట్ గా పరిగణించే విధానం అమలులో ఉంది.

రైతు భీమా పథకం నిధులతో రైతులకు పరిహారం
ఈ విధానంలో చిన్న ప్రాంతాలలో పంట నష్టం జరిగినా సరే రైతులకు సక్రమంగా పరిహారం అందే వీలు కలుగుతుంది. ఈ రైతు బీమా పథకం నిధులతో రాష్ట్రంలో లక్షలాది మంది రైతులు ప్రయోజనాలను పొందుతున్నారు. రైతులు తమ పంటలను సహజ ప్రకృతి విపత్తులు, తెగుళ్లు లేదా ఇతర కారణాలతో నష్టపోయిన పరిహారాన్ని పొంది నష్ట నివారణ చేసుకుంటారు. ప్రస్తుతం పంటల బీమా పథకానికి సంబంధించి నిధులు విడుదల చేయడంతో రైతన్నలకు కాస్త భరోసా ఇచ్చినట్టు అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+