గుడ్ న్యూస్.. మరో పథకానికి చంద్రబాబు శ్రీకారం.. అర్హులెవరంటే!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన నాటినుండి పాలనను పరుగులు పెట్టించే ప్రయత్నం చేస్తుంది. అంతేకాదు ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంపైన కూడా టిడిపి కూటమి ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది. ఇప్పటికే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దుచేసి, మెగా డీఎస్సీ కోసం కసరత్తు ప్రారంభించిన కూటమిప్రభుత్వం, పింఛన్ల పంపిణీ, అన్నా క్యాంటీన్ ల ఏర్పాట్లు తదితర హామీలను నెరవేర్చ పనిలో ఉంది.

మరో పథకానికి శ్రీకారం
ఇక తాజాగా మరో హామీకి సంబంధించి చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మరో పథకానికి సంబంధించి కీలకఆదేశాలను కూడా జారీ చేసింది. దీంతో ఏపీలోని విద్యార్థులకు శుభవార్త చెప్పినట్టు అయ్యింది. గతంలో వైసిపి హయాంలో ఇచ్చిన అమ్మఒడి పథకాన్ని పేరు మార్చి తల్లికి వందనం పేరుతో విద్యార్థుల కోసం అందించాలని భావించిన చంద్రబాబు సర్కార్ తల్లికి వందనం, స్టూడెంట్ కిట్ కు సంబంధించి క్లారిటీ ఇచ్చింది.

Chandrababu govt said good news to students aadhaar card must for this new scheme of ap

తల్లికి వందనం, స్టూడెంట్ కిట్ పై కీలక ఉత్తర్వులు
ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు తల్లికి వందనం పేరుతో ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలని టిడిపి కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే తల్లికి వందనం, స్టూడెంట్ కిట్ ప్రయోజనాలు పొందడానికి కొన్ని గుర్తింపు కార్డులను తప్పనిసరి చేస్తూ తాజాగా వెలువరించిన ఉత్తర్వులలో పేర్కొంది.

ఆధార్ తప్పనిసరి.. లేకుంటే ఇలా చెయ్యాలి
తల్లికి వందనం, స్టూడెంట్ కిట్ పథకాలకు సంబంధించి డబ్బుల కోసం లబ్ధిదారులు తప్పనిసరిగా ఆధార్ కలిగి ఉండాలని ప్రభుత్వం పేర్కొంది. ఒకవేళ ఎవరికైనా ఆధార్ కార్డు లేకపోతే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కూడా సూచించింది. విద్యాశాఖ ద్వారా ఆధార్ నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని పేర్కొంది. అయితే ఆధార్ వచ్చే వరకు పది రకాల పత్రాలను పరిగణనలోకి తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది.

ఆధార్ వచ్చే వరకు ఈ పత్రాలలో ఏదో ఒకటి ఇవ్వాలి
ఆధార్ వచ్చేవరకు ఓటరు గుర్తింపు కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు లేదా పోస్టల్ పాస్ బుక్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, ఉపాధి పథకం కార్డు, కిసాన్ పాస్ బుక్, ఆ వ్యక్తిని ధ్రువీకరిస్తూ గెజిటెడ్ అధికారి సంతకం చేసిన పత్రం, తహసిల్దార్ ఇచ్చే పత్రం, ఇలా పలు డాక్యుమెంట్లను అనుమతిస్తామని పేర్కొంది.

తల్లికి వందనం పథకం పొందాలంటే ఆ షరతు
తల్లికి వందనం పథకంలో భాగంగా దారిద్ర రేఖకు దిగువన ఉండే స్కూళ్లకు పిల్లల్ని పంపించే తల్లులు లేదా సంరక్షకులకు సంవత్సరానికి 15000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తారు. అయితే ఈ సహాయం పొందాలంటే విద్యార్థులకు 75% హాజరు తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వులలో పేర్కొంది.

స్టూడెంట్ కిట్ లో ఇచ్చేవి ఇవే
ఇక స్టూడెంట్ కిట్ కింద ప్రభుత్వం ఎయిడెడ్ స్కూల్లో చదివే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, బ్యాగ్, నోట్ పుస్తకాలు, వర్క్ బుక్ లు, ఇంగ్లీష్ డిక్షనరీ, మూడు జతల యూనిఫామ్, బెల్ట్ , ఒక జత బూట్లు, రెండు జతల సాక్స్ లు అందజేస్తున్నట్టు పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+