ఆ కేంద్ర పథకంపై చంద్రబాబు కీలక నిర్ణయం..! ఇక రాష్ట్రంలో..!
ఏపీలో గతేడాది ఎన్నికల్లో కూటమిగా ఏర్పడి ఘన విజయం సాధించిన టీడీపీ, బీజేపీ, జనసేన ప్రస్తుతం ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నాయి. అదే సమయంలో కేంద్రంలోనూ టీడీపీ-బీజేపీ భాగస్వాములుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం మార్పులు చేర్పులతో తీసుకొచ్చిన ఓ పథకానికి రాష్ట్రంలోనూ విస్తృతంగా ప్రచారం కల్పించాలని సీఎం చంద్రబాబు ఇవాళ జరిగిన కూటమి పార్టీ నేతల భేటీలో నిర్ణయించారు.
పేదలకు ఉపాధి కల్పించడంతోపాటు, గ్రామాల్లో ఆస్తులను సృష్టించేలా కేంద్రం తెచ్చిన వికసిత్ భారత్ జీ రామ్ జీ పథకాన్ని అమలు చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఉపాధి హామీ పథకం పేరు మార్చి కొత్తా తెచ్చిన వీబీ జీ రామ్ జీ పథకంపై ప్రజలకు, లబ్దిదారులకు వివరించేలా కార్యాచరణ సిద్దం చేయాలని సీఎం సూచించారు. ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, జనసేన మంత్రి కందుల దుర్గేష్ తో ఆయన భేటీ అయ్యారు. ఈ భేటీలో జీ రామ్ జీ పథకం అమలు పైనా... ఈ పథకం ద్వారా రాష్ట్రానికి, పేదలకు ఎలాంటి మేలు జరుగుతుందన్న అంశంపై చర్చించారు.

గతంలో ఉన్న ఉపాధి హామీ పథకం కంటే ఇప్పుడు కేంద్రం తెచ్చిన జీ-రామ్-జీ పథకంలో అదనంగా ఇంకొన్ని పనులు చేసుకునే వెసులుబాటు ఉందని, సోలార్ లైటింగ్ సిస్టం ఏర్పాట్లను ఈ స్కీం పరిధిలోకి తెచ్చారని చంద్రబాబు తెలిపారు. ఇలాంటి వాటి వల్ల గ్రామాల్లో మౌలిక వసతులు సమకూరతాయన్నారు. రాష్ట్రాన్ని 10 సూత్రాల ఆధారంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఇప్పుడు వాటి అమలుకు జీ-రామ్-జీ స్కీం ఉపయోగపడుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ పథకాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోగలిగితే.. రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయగలుగుతామన్నారు.

ఈ స్కీంలో భాగంగా గ్రామాల్లో గోకులాలు నిర్మించుకోవచ్చని, ప్లాంటేషన్ చేసుకోవచ్చని, పశు గ్రాసం పండించుకుని ఉపాధి కల్పించవచ్చని, తాగునీరు అందించే జల్ జీవన్ మిషన్-అమరజీవి జలధార వంటి పథకాలను అనుసంధానం చేసుకోవచ్చని చంద్రబాబు తెలిపారు. పాఠశాలలు, ఆస్పత్రులు, కమ్యూనిటీ సెంటర్లు నిర్మించుకోవడం లేదా రిపేర్లు చేసుకోవడం ద్వారా ఆస్తులను మరింతగా అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. అలాగే ఏయే రోజుల్లో పనులు చేపట్టాలనే విషయం మీద కూడా గ్రామ సభల్లో చర్చించి గ్రామస్థుల సూచనలను పరిగణనలోకి తీసుకుని నోటిఫై చేయాలన్నారు. అలాగే జీ రామ్ జీ స్కీం కింద ఎలాంటి పనులు చేపడుతున్నామనే విషయాన్ని ఆన్ లైన్లో పొందుపరుస్తే వికసిత భారత్, స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలు నెరవేరుతాయన్నారు. దీనిపై ఓ పక్క మూడు పార్టీలు ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తూనే.. మరోవైపు అసెంబ్లీలో కూడా చర్చ చేపడతామన్నారు.
-
ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్-బకాయిలపై చంద్రబాాబు ఆదేశాలు..! -
అమరావతి బిల్లు పాస్ కాగానే లోకేష్ చేసిందిదే..! చంద్రబాబు రియాక్షన్..! -
ఏపీలోని 13 కార్పోరేషన్లలో డివిజన్ల పెంపు-విజయవాడ, గుంటూరు సహా ఇవే..! -
టీడీపీ ఎమ్మెల్యే తీరుపై చంద్రబాబు సీరియస్-తక్షణం..! -
ఒంటిమిట్ట కోదండ రామస్వామి కల్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు -
పేద, మధ్యతరగతి ప్రజలకు బిగ్ షాక్.. ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ !! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా!












Click it and Unblock the Notifications