జగన్ కు చంద్రబాబు ఘాటు కౌంటర్-ఆయన్ను అడ్డుకోలేదు-నెయ్యి మాత్రం వాడారని క్లారిటీ..!

ఏపీలో లడ్డూ వివాదం నేపథ్యంలో తిరుమల దర్శనానికి వెళ్లేందుకు సిద్దమైన వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను అడ్డుకున్నారంటూ ఆయన చేసిన విమర్శల్ని సీఎం చంద్రబాబు తోసిపుచ్చారు. ఆయన్ను ఎవరూ అడ్డుకోలేదన్నారు. తిరుపతిలో వైసీపీ నేతలు భారీ ర్యాలీలు తీస్తామంటే వద్దన్నట్లు తెలిపారు. శ్రీవారి మీద భక్తి ఉండే ఏ భక్తుడికైనా దర్శనం చేసుకునే అవకాశం ఉందన్నారు. అదే సమయంలో వేరే మతాల వ్యక్తులుంటే అక్కడి సంప్రదాయాలు గౌరవించాలన్నారు.

Chandrababu hit back to ys jagan s allegations on Tirumala darshan say no one above tradition

తాజాగా దేవస్థానంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, ఇలాంటి సమయంలో జగన్ అక్కడికి వెళ్లేందుకు సిద్దమయ్యారని, వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీలకు ప్రయత్నించినందుకే సెక్షన్ 30 పెట్టారన్నారు. జగన్ కు నోటీసులు ఇచ్చినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని, అలా ఇచ్చి ఉంటే చూపించాలన్నారు. సమాజంలో ఏ మతానికైనా కొన్ని సంప్రదాయాలు, ఆచారాలుంటాయని, అక్కడికి వెళ్లినప్పుడు వాటిని పాటించాలని, వాటి కంటే ఎవరూ గొప్పవారు కాదన్నారు. ధిక్కార శైలి మాత్రం సరికాదన్నారు.

తిరుమల పవిత్రత కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. అలా జరగకపోతే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని చంద్రబాబు తెలిపారు. గతంలో నిబంధనలు ఉల్లంఘించి తిరుమలకు వెళ్తే.. ఇప్పుడు కూడా వెళ్లాలా అని చంద్రబాబు ప్రశ్నించారు. రౌడీయిజం చేస్తాననడం సరికాదన్నారు. చట్టాలు పాలించే కాశ్మీర్ ముఖ్యమంత్రుల వంటి వారు కూడా డిక్లరేషన్ ఇచ్చి దర్శనానికి వెళ్లారన్నారు. హిందూ మతాన్ని గౌరవిస్తానంటున్న జగన్ .. తిరుమలలో ఆచారం పాటించాల్సిందేనన్నారు. బైబిల్ ఇంట్లోనే కాదు బయట కూడా చదువుకోవచ్చన్నారు. తాను కూడా మత సామరస్యాన్ని పాటిస్తానన్నారు.

తిరుమల లడ్డూ తయారీలో వాడే నెయ్యి కల్తీ జరిగిందని పదే పదే గుర్తించి ఈవో ఎన్డీడీబీకి పరీక్షలకు పంపారన్నారు. గతంలో కల్తీ నెయ్యి వాడారని, వాడలేదని జగన్ ఎలా చెప్తారని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ రిపోర్టును బయటపెట్టకపోతే తాము తప్పుచేసినట్లు అవుతుందన్నారు. తాను తప్పుచేశానని జగన్ చెప్తున్నారని, కానీ టెండర్లకు షరతులు ఎందుకు మార్చారని ప్రశ్నించారు. రివర్స్ టెండర్ల ద్వారా నాసిరకం నెయ్యి తెచ్చి అపవిత్రం చేశారన్నారు. ఇప్పుడు ఈవో చెప్పలేదు, రిపోర్టులు లేవనంటున్నారన్నారు. అన్ని ఆలయాల్లోనూ ఇలాంటి అక్రమాలు జరిగాయని, వాటిని తాము ప్రక్షాళన చేశామన్నారు.

జగన్ కు రాజకీయాల్లో ఉండే అర్హత ఉందా, హుందాతనం ఉందా అని చంద్రబాబు ప్రశ్నించారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే అధికారం జగన్ కు ఎవరిచ్చారని అడిగారు. తిరుమల వెళ్లేందుకు ఇష్టం లేక, డిక్లరేషన్ పెట్టేందుకు ఇష్టంలేక ఉండిపోవడం ఆయన సమస్య మాత్రమే అన్నారు. ఆలయాల్లో, ప్రార్ధనా మందిరాల్లో వేరే మతాల వాళ్లు వెళ్లినప్పుడు అక్కడ సంప్రదాయాల్ని గౌరవించేలా చట్టం తెస్తామని చంద్రబాబు తెలిపారు. దానికి దళితుల్ని రానివ్వడం లేదనడం సరికాదన్నారు. జగన్ కు విశ్వసనీయత లేదన్నారు. నాలుగు నెయ్యి ట్యాంకర్లు వాడకపోతే తాను సంతోషించే వాడినన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+