పోలీసులపై చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు- గవర్నర్ జోక్యం చేసుకోవాలి..!!
గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి పట్ల చంద్రబాబు నాయుడు ఘాటుగా స్పందించారు. వైసీపీతో పాటు పోలీసులపైనా వివాదాస్పద వ్యాఖ్యలు
విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరంలో తలెత్తిన ఉద్రిక్తత పరిస్థితులపై చంద్రబాబు ఘాటుగా స్పందించారు. పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సాయంత్రం గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై స్థానిక శాసన సభ్యుడు వల్లభనేని వంశీ మోహన్ వర్గీయులు దాడి పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూండాల పనేనంటూ ఆయన ధ్వజమెత్తారు.
గన్నవరం టీడీపీ కార్యాలయం పై వైసీపీ గూండాల దాడిని, వాహనాలను తగలబెట్టిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాష్ట్రాన్ని రావణకాష్ఠంలా మారుస్తున్న జగన్ ఆ మంటల్లో కాలిపోవడం ఖాయం. వైసీపీ ఉన్మాదులు అరాచకాలు చేస్తుంటే పోలీసులు ఏ గాడిదలు కాస్తున్నారు?(1/2)#YSRCPRowdyism #YCPGoondas pic.twitter.com/dFqEH51JCZ
— N Chandrababu Naidu (@ncbn) February 20, 2023
వల్లభనేని వంశీపై తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యక్తిగత దూషణలు చేశారనే కారణంతో ఆయన వర్గీయులు పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. అద్దాలను పగులగొట్టారు. ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. ఆఫీస్ ఆవరణలో పార్క్ చేసిన వాహనాలకు నిప్పు పెట్టారు. దీనితో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కాగా ఈ ఘటన అనంతరం వల్లభనేని వంశీపై టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తోన్నారు. గన్నవరం పోలీస్ స్టేషన్ ఎదుట వారు ఆందోళనకు దిగారు.. అక్కడే బైఠాయించారు. వంశీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులపైనా విమర్శలు గుప్పించారు.
ఈ పరిణామాలపై చంద్రబాబు నాయుడు స్పందించారు. ఘాటు విమర్శలు చేశారు. పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారాయన. తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. దాడికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్ ను ఆయన తన ట్వీట్ కు జోడించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైసీపీ గూండాలు దాడి చేశారంటూ ఆరోపించారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవే లేకుండా చేశారు. పోలీసు శాఖను మూసేశారా? లేక వైసీపీలో విలీనం చేశారా? సీఎం ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వానికి ఈ ఘటనలే ఉదాహరణ. రాష్ట్ర గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలి. కారకుల పై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలి.(2/2)#YSRCPTerrorismInAP #YCPTerroristsAttack
— N Chandrababu Naidu (@ncbn) February 20, 2023
ఆఫీస్ ప్రాంగణంలో పార్క్ చేసి ఉంచిన వాహనాలను తగలబెట్టారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి- రాష్ట్రాన్ని రావణకాష్ఠంలా మారుస్తున్నాడని విమర్శించారు. ఆ మంటల్లో జగన్ కాలిపోవడం ఖాయమని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ ఉన్మాదులు అరాచకాలు చేస్తుంటే పోలీసులు ఏ గాడిదలు కాస్తున్నారు? అంటూ వ్యాఖ్యానించారు.
అధికార పార్టీ నాయకులు రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవే లేకుండా చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీసు శాఖను మూసేశారా? లేక దాన్ని వైఎస్ఆర్సీపీలో విలీనం చేశారా? అంటూ నిలదీశారు చంద్రబాబు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వానికి ఈ ఘటనలే ఉదాహరణ అని అన్నారు. దీనిపై గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ దాడి కారకుల పై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications