ఖైదీగా చంద్రబాబు తొలి రోజు ఇలా - ఊహించని విధంగా..!!
టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉన్నారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో తొలి సారి చంద్రబాబు జైలుకు వెళ్లారు. స్కిల్ స్కాంలో సీఐడీ కేసులో కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధించింది. అర్ద్రరాత్రి రాజమండ్రి జైలుకు చేరుకున్న చంద్రబాబుకు జైలు అధికారులు కోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. తొలి రోజు జైలులో చంద్రబాబు ఆందోళనతో కనిపించారని సమాచారం. ఇంటి నుంచి భోజనం అందించారు. కుటుంబ సభ్యులు కలిసేందుకు అనుమతి ఇచ్చారు.
చంద్రబాబుకు ఇంటి నుంచి వచ్చిన భోజనం#Chandrababu #TDP #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/fDZKeOdyTJ
— oneindiatelugu (@oneindiatelugu) September 11, 2023
జైలులో చంద్రబాబు
చంద్రబాబును సీఐడీ అధికారులు ఆదివారం అర్ధరాత్రి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. జైలు అధికారులు ఆయనకు రిమాండ్ ఖైదీ నంబర్ 7691 కేటాయించారు. జైలులోని స్నేహ అప్పర్ బ్లాక్ లోని ప్రత్యేక గదిలో ఉంచారు. శనివారం ఉదయం నంద్యాలలో సీఐడీ అరెస్ట్ చేసిన సమయం నుంచి విజయవాడకు ప్రయాణం..రాత్రంతా విచారణ..ఆదివారం కోర్టు విచారణ..రాజమండ్రికి ప్రయాణంతో నిద్ర లేమికి గురయ్యారు. దీంతో జైలుకు వచ్చిన సమయం నుంచి చంద్రబాబు అలసటగా కనిపించినట్లు తెలుస్తోంది. నిత్యం తెలలవారుజామున లేచి యోగాసనాలు చేసే చంద్రబాబు..జైలులో ఆలస్యంగా లేచి మెడిటేషన్ కు మాత్రమే పరిమితం అయినట్లు తెలుస్తోంది.

ఇంటి నుంచి భోజనం
కోర్టు ఆదేశాలతో ఆయనకు ప్రత్యేకంగా ఆహారం, అవసరమైన మందులు, ఇతర వసతులు కల్పించారు. దీంతో, ఈ రోజు ఉదయం..కిద్ది సేపటి క్రితం ఇంటి నుంచి జైలులో ఉన్న చంద్రబాబు కు అల్పాహారం.. భోజనం అందాయి. రాజమండ్రిలో ప్రత్యేకంగా వాహనంలో చంద్రబాబు వ్యక్తిగత సిబ్బంది భోజనం సిద్దం చేసి వ్యక్తిగత సహాయకుడి ద్వారా జైలుకు పంపారు. అందులో ఈ ఉదయం బ్లాక్ కాఫీ తీసుకున్న చంద్రబాబు...మధ్నాహ్నం భోజనంలో బ్రౌన్ రౌస్, బెండకాయ కూర, నాలుగు పుల్కాలు, పచ్చి కూరల ముక్కలు, పెరుగు ఇచ్చినట్లు తెలుస్తోది. అదే విధంగా వేడినీరు ఫ్రూట్ సలాడ్, బ్లాక్ కాఫీని అందించినట్లు తెలుస్తోంది. ఇటు చంద్రబాబు బెయిల్ కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి.

కలవనున్న కుటుంబ సభ్యులు
ఉదయం న్యూస్ పేపర్లు చదవిన చంద్రబాబు కాసేపట్లో కుటుంబ సభ్యులను కలవనున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, బ్రాహ్మణి రాజమండ్రి జైలులో కలవనున్నారు. ఇప్పటికే చంద్రబాబు రిమాండ్ రిపోర్టు అందటంతో ముందుగా ఈ ఉత్తర్వుల పై స్క్వాష్ పిటీషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు. దీని పైన కోర్టు తీర్పుకు అనుగుణంగా బెయిల్ పిటీషన్ దాఖలు చేసే ఆలోచనలో న్యాయవాదులు ఉన్నట్లు తెలుస్తోంది. న్యాయ పరంగా బెయిల్ కోసం ఎలా ముందుకు వెళ్లాలనే దాని పైన న్యాయవాది లూధ్రా కసరత్తు చేస్తున్నారు. ఏసీబీ కోర్టు తీర్పు స్క్వాష్ చేయించాలనే దిశగా చర్చలు చేస్తున్నారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications