ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ముహుర్తం ఫిక్స్-కేబినెట్లో మంత్రులతో సీఎం..!
ఏపీలో పెండింగ్ లో ఉన్న మున్సిపల్ ఎన్నికల (municipal polls) నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఇవాళ అమరావతిలో నిర్వహించిన కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రులతో పురపాలక ఎన్నికల నిర్వహణపై మాట్లాడిన సీఎం చంద్రబాబు.. వారిని అలర్ట్ చేశారు. అలాగే మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలన్న దానిపై వారికి ఓ క్లారిటీ కూడా ఇచ్చారు. వీటికి సిద్ధంగా ఉండాలని మంత్రులకు సూచించారు.
రాష్ట్రంలో ఇప్పటికే అన్ని పురపాలక సంఘాలు, నగర పాలక సంస్ధలు, నగర పంచాయతీల గడువు ముగియడంతో ప్రత్యేకాధికారుల పాలన అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఆయా చోట్ల పాలన గాడితప్పకుండా ఉండాలంటే వెంటనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని పట్టుదలగా ఉన్న ప్రభుత్వం.. ఈ మేరకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తోంది. ఇదే క్రమంలో ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలోనూ మున్సిపల్ ఎన్నికల ప్రస్తావన వచ్చింది. దీంతో సీఎం చంద్రబాబు మున్సిపల్ ఎన్నికలపై మంత్రులకు క్లారిటీ ఇచ్చారు.

రాష్ట్రంలో మరో మూడు, నాలుగు నెలల్లో మున్సిపల్ ఎన్నికల్ని నిర్వహిస్తే ఎలా ఉంటుందని మంత్రుల్ని చంద్రబాబు అడిగారు. వారు కూడా దీనికి అంగీకరించడంతో ఆ మేరకు ఎన్నికల ఏర్పాట్లు చేసుకోవాలని వారికి సూచించారు. అలాగే ఎన్నికల్ని 2011 జనాభా లెక్కల ఆధారంగా నిర్వహించాలని కూడా నిర్ణయించారు. ప్రస్తుతం జనాభా లెక్కల ప్రక్రియ మొదలవుతున్న నేపథ్యంలో ఇది పూర్తయ్యే వరకూ టైం పడుతుంది. అందుకే పాత లెక్కలతోనే మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications