హైద్రాబాద్‌లో తెలంగాణ అడ్డుకుంటోంది: కెఈ, నా కన్నా తెలివైనదానివి: స్మార్ట్‌పై బాబు
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని తెలంగాణ అడ్డుకుంటోందని ఏపీ ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి సోమవారం ఆరోపించారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా తమ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలబెడుతుందని చెప్పారు.
మంగళవారం కర్నూలు జిల్లాలోని పుడిచర్లలోని ఓర్వకల్లులో చంద్రబాబు మెగా ఇండస్ట్రియల్ హబ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కెఈ మాట్లాడారు. చంద్రబాబు ప్రపంచమే అబ్బురపడేలా హైదరాబాదును అద్భుతంగా అభివృద్ధి చేశారన్నారు.
అయితే, హైదరాబాదులో ఉమ్మడి రాష్ట్రంలో కట్టిన కార్యాలయాలకు తెలంగాణ ప్రభుత్వం తాళం వేస్తోందని మండిపడ్డారు. తమ ప్రభుత్వం చేతల ప్రభుత్వం అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని చెప్పారు. గడిచిన సంవత్సరం కాలంలో రైతు రుణమాఫీ చేశామన్నారు.

ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చామన్నారు. కర్నూలు జిల్లాను విద్యా, వైజ్ఞానిక, పారిశ్రామిక నగరంగా అభివృద్ధి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి అందరివారు అని, అంతకన్నా ముందు రాయలసీమకు చెందిన వారు అని కేఈ అన్నారు. సీఎం రాయలసీమ పైన ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
రాయలసీమను కరువు రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు కృష్ణా డెల్టాకు పట్టిసీమ నీళ్లిచ్చి, శ్రీశైలం నీళ్లన్నీరాయలసీమకే ఇచ్చారని, ఇది రాయలసీమకు శుభపరిణామమన్నారు. ప్రతిపక్షాలు ప్రతి దానిని రాద్దాంతం చేస్తున్నాయన్నారు.
విద్యార్థుల ప్రశ్నలు.. చంద్రబాబు సమాధానం
కర్నూలు జిల్లా పుడిచర్లలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విద్యార్థులు పలువురు ప్రశ్నలు సంధించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు.
ఉద్యోగ అవకాశాల్లో మహిళలు, పురుషులకు తేడా లేదన్నారు. రాబోయే ఐదు, పదేళ్లలో ఏపీని విద్యా హబ్‌గా చేస్తామన్నారు. ప్రతిభ ఉంటే ఎక్కడైనా రాణించవచ్చునని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడికైనా మహిళలు వెళ్లి పని చేయవచ్చునని చెప్పారు.
ప్రపంచంలోని అందరి కంటే భారతీయులకు ఎక్కువ తెలివితేటలు ఉన్నాయన్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ సంస్థలకు మనవాళ్లే అధినేతలుగా ఎదుగుతున్నారన్నారు. యువత కూడా భారత దేశంలోనే ఎక్కువ ఉందని చెప్పారు. రూ.వంద రెండు వందల కోట్లు నష్టమైనా విద్యార్థులకు అండగా ఉంటామన్నారు.
కర్నూలు నగరాన్ని సమయంలో స్మార్ట్ సిటిగా చేస్తారని వీణ అనే విద్యార్థిని అడిగారు. దానికి చంద్రబాబు ఆమెను మెచ్చుకుంటూ.. నువ్వు నాకంటే తెలివైనదానివి అంటూ కితాబిచ్చారు. సాధ్యమైనంత త్వరగా స్మార్ట్ సిటీగా చేద్దామన్నారు.
విద్యార్థులు, స్థానికులు అందరి సహకారంతో ఓ సంవత్సరంలో ఓ ప్రణాళికను తీసుకు వద్దామన్నారు. ఔటర్, ఇన్నర్ రింగురోడ్డులు వేస్తామని, రాజధానులకు రహదారులు వేద్దామన్నారు. ఓ విద్యార్థి ఓ ప్రశ్న అడగగా.. నీ ఉద్దేశ్యం నాకు అర్థమైందని, కూర్చోవాలని సూచించారు.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!!












Click it and Unblock the Notifications