న్యాయవ్యవస్థలో చంద్రబాబు జోక్యం.. సుప్రీంకోర్టు సీజేఐకు సీఎం జగన్ లేఖ: అజయ్ కల్లాం
అమరావతి భూ కుంభకోణంపై వస్తోన్న కథనాలపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా జరుగుతోన్న ప్రచారానికి పుల్‌స్టాప్ పెట్టేందుకు ముఖ్య నిర్ణయాలు తీసుకున్నది. ఈ మేరకు శనివారం రాత్రి ఏపీ ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం మీడియాకు వివరాలు వెల్లడించారు.
అమరావతి భూ కుంభకోణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు జడ్జీ జస్టిస్ సోమయాజులు స్టే ఇచ్చారని అజయ్ కల్లాం తెలిపారు. మాజీ అడ్వొకేట్ జనరల్ కేసులో హైకోర్టు ఏకంగా గాగ్ ఆర్డర్ ఇచ్చిందని తెలిపారు. ఈ కేసులో సుప్రీంకోర్టు జడ్జీ జస్టిస్ ఎన్‌వీ రమణ జోక్యం చేసుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందన్నా. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ ఏ బాబ్డేకు ఫిర్యాదు చేశామని తెలిపారు.

ఇందుకు సంబంధించి ఆధారాలను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు అక్టోబర్ 8న లేఖ అందజేశామని తెలిపారు. నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన సర్వోన్నత న్యాయస్థానం ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జీని అడ్డు పెట్టుకుని ప్రతిపక్ష నేత చంద్రబాబు న్యాయవ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నారని తెలిపారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు న్యాయవ్యవస్థను ఎంచుకున్నారని చెప్పారు.
Recommended Video
జనవరిలో అధికార వికేంద్రీకరణ బిల్లులను..ఏపీ అసెంబ్లీ ఆమోదించిందని తెలిపారు. ఆ వెంటనే ముఖ్యమంత్రిని ప్రతివాదిగా చేస్తూ హైకోర్టులో 30 పిటిషన్లు దాఖలయ్యాయని పేర్కొన్నారు. ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరీని సుప్రీంకోర్టు జడ్జీ ఎన్వీ రమణ ప్రభావితం చేస్తున్నారని వెల్లడించారు. సుప్రీంకోర్టు జడ్జీ ఎన్వీ రమణ జోక్యం తర్వాత హైకోర్టులో పరిణామాలు మారిపోయాయని చెప్పారు. చంద్రబాబు కోరుకున్నట్టు ముఖ్యమైన కేసులను జస్టిస్ శేషసాయి, జస్టిస్ సత్యనారాయణ మూర్తి, జస్టిస్ సోమయాజులు, జస్టిస్ రమేష్ బెంచ్‌కు మారిపోయాయని పేర్కొన్నారు.
-
పిడుగులు, భారీ వర్షాలు - ఏపీలో ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
అవార్డుల గురించి చంద్రబాబుకు పాఠాలు చెప్పిన చిరంజీవి... విన్నారా? -
తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు, రేవంత్‌రెడ్డి "ఉగాది" స్పెషల్ విషెస్ !!! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications