ఏపీ కేబినెట్ నిర్ణయాలు, సీఆర్డీఏకు చైర్మన్‌గా చంద్రబాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత సాధికార సంస్థకు చైర్మన్‌గా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యవహరించనున్నారు. సచివాలయంలో మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు అంశాల పైన చర్చించారు. ఇందులో రాజధాని ప్రాంత సాధికార సంస్థకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఇసుక పాలసీ పైన కేబినెట్లో చర్చించారు. పెన్షన్ల రద్దు అంశాన్ని పలువురు మంత్రులు ప్రస్తావించారు. అలాగే బైరటీస్ లీజును రద్దు చేయాలని నిర్ణయించారు. మంగంపేట బైరటీస్ గనుల వ్యవహారంలో భారీ అవినీతి జరిగిందని మంత్రివర్గం నిర్ణయించింది. దీని పైన విచారణ జరిపించాలని కూడా నిర్ణయించారు.

2004లో బైరటీస్ గనుల తవ్వకాల పైన ప్రభుత్వం జీవో తీసుకు వచ్చింది. దీనిని రద్దు చేయనున్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ వైద్యసేవగా మార్చనున్నారు. వైద్య సేవలను 938 నుండి 1038కి పెంచనున్నారు. ఈ వైద్య సేవల కింద రూ.2.5 లక్షల ఆర్థిక సాయాన్ని అందించనున్నారు.
రాజధాని పైన సీఆర్డీఏ పైన బిల్లు తేవాలా లేక ఆర్డినెన్స్ తేవాలా అనే స్థానిక రైతులతో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకోనున్నారు. బైరటీస్ గనుల్లో అక్రమాలు జరిగాయని నిర్ధారణ అయింది. ప్రజా నాయకులుగా చెబుతున్న వారు అక్రమాలకు పాల్పడ్డారని మంత్రివర్గం అభిప్రాయపడింది.
మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు
ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ వైద్యసేవగా మార్పు
ఎన్టీఆర్ వైద్యసేవల కింద ఖర్చు పరిమితి రూ.2.5 లక్షలు
ఈ పథకం కిందకు వచ్చే వ్యాధుల సంఖ్యను 1038కి పెంపు
2004 తర్వాత బైరటీస్ గనుల తవ్వకాలకు జారీ చేసిన జీవో రద్దు
రాజధాని ప్రాంత సాధికార సంస్థకు ఆమోదం












Click it and Unblock the Notifications