• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చంద్రబాబు ఇంకా సీఎం అన్న భ్రమలో మునిగి తేలుతున్నాడు : వైసీపీ ఎంపీ సెటైర్

|

కరోనా కట్టడి కోసం ఏపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నా, రోజుకో ఉచిత సలహా ఇస్తున్న చంద్రబాబు తన వైఖరి మార్చుకోవటం లేదని రాజ్య సభ సభ్యుడు , వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు . ట్విటర్‌ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబుపై తనదైన శైలిలో సెటైర్లు వేసిన విజయసాయి రెడ్డి చంద్రబాబు ఇంకా తాను ముఖ్యమంత్రినేనని భ్రమలో ఉన్నారని ఎద్దేవా చేశారు . ప్రధాని మోదీ రోజు ఆయనకు నాలుగు సార్లు ఫోన్‌చేసి సలహాలు తీసుకుంటున్నారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆయన పేర్కొన్నారు .

ఏపీ సీఎస్ నీలం సాహ్నికి మాజీ సీఎం చంద్రబాబు లేఖ ... ఏ విషయంలో అంటే

 ప్రధాని రోజూ నాలుగు సార్లు ఫోన్ చేసి సలహాలు అడుగుతున్నట్టు భ్రమలో చంద్రబాబు

ప్రధాని రోజూ నాలుగు సార్లు ఫోన్ చేసి సలహాలు అడుగుతున్నట్టు భ్రమలో చంద్రబాబు

ఏపీ సీఎంగా చంద్రబాబు తానే ఉన్నాను అనుకుంటున్న భ్రమలో నుంచి బయటకు వస్తే బాగుటుందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ కాలంలో పేద ప్రజలు ఇబ్బందులు రాకుండా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని చర్యలు తీసుకుంటున్నా చంద్రబాబు మాత్రం తనదైన వైఖరి మార్చుకోవటం లేదన్నారు . తాజాగా ఎంపీ విజయసాయి చేసిన ట్వీట్ లో "తానింకా సీఎం అయినట్టు, ప్రధాని రోజూ నాలుగు సార్లు ఫోన్ చేసి సలహాలు అడుగుతున్నట్టు భ్రమలో మునిగి తేలుతున్నాడట బాబు. సమాంతర ప్రభుత్వం నడపాలని సలహా ఇచ్చినాయన ఒక వర్చువల్ రియాలిటీ గేమ్ తయారు చేయించి బాబుకు బహుకరించారని అంటున్నారు" అని ఎద్దేవా చేశారు.

సీఎం జగన్ సాహసోపేత నిర్ణయాలతో కరోనా కట్టడికి కృషి

సీఎం జగన్ సాహసోపేత నిర్ణయాలతో కరోనా కట్టడికి కృషి

ఇక అంతేకాదు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కరోనా సంక్షోభ సమయంలో సాహోసోపేతమైన నిర్ణయాలు తీసుకోవటంతోనే ఏపీలో కరోనా కట్టడి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. సీఎం జగన్ ప్రజలను ఆపదల నుంచి గట్టెక్కిస్తున్నారని పేర్కొన్నారు.రాష్ట్ర అధినేత సమర్థత, సాహసోపేత నిర్ణయాలు తీసుకోగలిగే చొరవ సంక్షోభ సమయాల్లో ప్రజలను ఆపద నుంచి గట్టెక్కిస్తాయి. కరోనా వైరస్ నియంత్రణ, తక్కువ ప్రాణనష్టంతో ఏపీ దిశా నిర్దేశం చేస్తుంది. ప్రతి రాష్ట్రం మనల్ని అసుసరిస్తుంది. కేంద్రం ఇప్పటికే ప్రశంసించింది. డబ్ల్యుహెచ్‌వో కూడా ఆరా తీస్తోంది' అంటూ ట్వీట్‌ చేశారు.

 పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ల సోది తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదు

పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ల సోది తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదు

ఇక మరో ట్వీట్ లో విజన్ 2020 పేరుతో డప్పు కొట్టుకున్న బాబు రాష్ట్రంలో కనీసం 4-5 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏర్పాటు చేసి ఉంటే కోవిడ్ నేపథ్యంలో ఎంతో ఊరట దొరికేది. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ల సోది తప్ప ఊడబొడిచిందేమీ లేదు. దోచుకునే ఛాన్స్ లేదని మెడికల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను గాలి కొదిలేశాడు అంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు .

  Lockdown : PM Narendra Modi Interacted With Village Panchayats Via Video Conference
  బాబు హయాంలో ప్రైవేట్ సంస్థలకు దోచి పెట్టారని ఆరోపణ

  బాబు హయాంలో ప్రైవేట్ సంస్థలకు దోచి పెట్టారని ఆరోపణ

  ఇక అంతేకాదు బాబు హయాంలో దోపిడీ చేశారని విద్యుత్ విషయంలోనూ చంద్రబాబు హయాంలో దోపిడీకి అడ్డు లేదని ఆయన విమర్శలు గుప్పించారు . "ఏప్రిల్ నెల కరెంటు కొనుగోళ్లలో 102 కోట్లు ఆదాచేసి ఏపీ ట్రాన్స్ కో దేశంలోనే అత్యుత్తమ సంస్థగా నిలిచింది. ఒక్క రూపాయి కూడా ప్రజాధనం వృథా కారాదన్న జగన్ గారి స్ఫూర్తితో యూనిట్ రూ.2.51 లకు రాబట్టింది. బాబు హయాంలో యూనిట్ రూ.4.68 కి కొని ప్రైవేటు సంస్థలకు దోచిపెట్టారు." అంటూ ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు విజయసాయి రెడ్డి . ఒకపక్క చంద్రబాబును , మరోపక్క బీజేపీ నాయకులను , ఇంకో పక్క జనసేనాను కూడా టార్గెట్ చేస్తూ విజయసాయి ఘాటు విమర్శలు గుప్పిస్తున్నారు .

  English summary
  Rajya Sabha member and YCP MP Vijayasai Reddy has criticized Chandrababu, saying that the AP government is taking all measures for corona, but does not change its attitude. He has said that Chandrababu is still delusional stage that he is the chief minister. "It is ridiculous to say that Prime Minister Modi telephoned him four times a day.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X