బాబుది ‘420’ దీక్ష, హీరో ఎంటరైతే.. విలన్ బొక్కలోకే: ఏకేసిన జగన్, జలీల్ ఖాన్‌కు చురకలు

Subscribe to Oneindia Telugu

విజయవాడ: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. అమరావతి అద్భుత రాజధాని అంటూ ఒక్క భవనం కూడా నిర్మించలేదని, ప్రజలను భ్రమింపజేస్తున్నారని మండిపడ్డారు.

హీరో ఎంటరైతే.. విలన్ ను బొక్కలో వేయడం ఖాయం

హీరో ఎంటరైతే.. విలన్ ను బొక్కలో వేయడం ఖాయం

బాబు చూపిస్తున్న ఆ లైవ్‌ సినిమా పేరు ‘ఓభ్రమరావతి.. ఓ రాజధాని.. ఓ అవినీతి కథ'' అని, సినిమా అంతా ఉత్తమ విలన్‌, ఆయన గ్యాంగే కనిపిస్తారని జగన్ ఎద్దేవా చేశారు. ఆ అన్యాయాలకు చరమగీతం గీతం పాడే రోజు తప్పక వస్తుందని, హీరో ఎంటరైతే.. విలన్‌ని బాది బొక్కలోవేయడం తథ్యమని తెలిపారు. 137వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శనివారం విజయవాడలోని చిట్టినగర్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

స్కాంల నిలయం చేశారు

స్కాంల నిలయం చేశారు

అలాగే, చంద్రబాబు విజయవాడలోనే ఉంటారు కానీ, ప్రజల సమస్యలు మాత్రం పట్టించుకోరని జగన్ అన్నారు. అభివృద్ధి చేయరు కానీ అవినీతి మాత్రం చక్కగా చేస్తారని, విజయవాడలో ఒక్క ఫ్లై ఓవర్ కూడా కట్టలేకపోతోన్న చంద్రబాబు నాయుడు ప్రపంచ స్థాయి రాజధాని కడతానని అంటున్నారని విమర్శించారు. విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్‌ని ఇప్పటికీ కట్టలేకపోయారని, మరోవైపు రాజధాని స్కాంలకు నిలయమైందని అన్నారు. చంద్రబాబు చెబుతోన్న అసత్యాలకు అదుపు లేకుండా పోతోందని అన్నారు. అప్పట్లో హైదరాబాద్‌ ఎయిర్‌ పోర్టుకి వెళ్లే మార్గం కోసం 19 కిలోమీటర్ల ఫ్లై ఓవర్‌‌ను వైయస్సార్ 3 ఏళ్లలోనే పూర్తి చేశారని, చంద్రబాబు కనీసం ఫ్లై ఓవర్‌ కట్టలేరు కానీ, అమెరికా అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

ఏ దేశానికెళితే అదే పాట

ఏ దేశానికెళితే అదే పాట

చంద్రబాబు జపాన్ వెళ్లి బుల్లెట్ ట్రైన్‌ వస్తుందంటారని, అమెరికా వెళ్లి వచ్చి మైక్రోసాప్ట్‌ను తీసుకొస్తున్నానని చెబుతారని జగన్ చురకలంటించారు. చంద్రబాబు ఏ దేశానికెళితే ఆ దేశం పాట పడతారని అన్నారు. ఈ విషయాలపై చంద్రబాబును ఎవరైనా ప్రశ్నిస్తే వారు రాజధానికి వ్యతిరేకమని ఎదురుదాడికి దిగుతారని అన్నారు.

చంద్రబాబుది 420 దీక్ష

చంద్రబాబుది 420 దీక్ష

ఏప్రిల్ 20న చంద్రబాబు చేపట్టిన దీక్షపై స్పందించారు జగన్మోహన్‌ రెడ్డి. ‘బాబు పుట్టిన రోజున దీక్ష చేస్తారట. ఆయన పుట్టినరోజు ఎప్పుడో తెలుసా? ఏప్రిల్ 20 అట. ఏప్రిల్ అంటే 4.. 20వ రోజున చేస్తారట.. అంటే 420.. ఆ ఏప్రిల్‌ 20న ఆయన కొంగ జపం చేస్తారట. ఆయన నిరాహార దీక్ష చేస్తారట. ఎంపీలతో రాజీనామా చేయించకపోగా ఇటువంటి పనులు చేస్తున్నారు. టీడీపీ ఎంపీలతో చంద్రబాబు రాజీనామాలు చేయించి, ఆమరణ దీక్షకు దిగి ఉంటే ప్రత్యేక హోదా వచ్చేది. అవి చేయకుండా ఏప్రిల్ 20న, ఈ 420 మనిషి దీక్ష చేస్తారట" అని జగన్ చురకలంటించారు. కాగా, చంద్రబాబు నాయుడు ఇన్నాళ్లూ ప్రత్యేక హోదా అనే అంశాన్ని దగ్గరుండి నీరుగార్చారని జగన్ ఆరోపించారు.

బీకాంలో ఫిజిక్స్ ఎమ్మెల్యే అంటూ..

బీకాంలో ఫిజిక్స్ ఎమ్మెల్యే అంటూ..

'ఇక్కడి ఒక ఎమ్మెల్యే బీకాంలో ఫిజిక్స్‌ చదివాడట' అని టీడీపీ నేత జలీల్‌ ఖాన్‌ని ఉద్దేశించి జగన్మోహన్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. డబ్బులు తీసుకుని అమ్ముడు పోయి పార్టీ మారిన కొందరు అభివృద్ధి కోసమే అలా చేశామంటూ మాయమాటలు చెబుతున్నారని అన్నారు. వారి పక్కనే సీఎం ఉన్నప్పటికీ ప్రజల సమస్యలు తీర్చాలని అడగరని జగన్ మండిపడ్డారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSRCP president YS Jaganmohan Reddy on Saturday said that TDP president and CM Chandrababu Naidu is villain of Andhra Pradesh.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి