చంద్రబాబు నోట జై తెలంగాణ: వ్యూహాత్మకమా(పిక్చర్స్)
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జై తెలంగాణ అని నినాదాలు చేశారు. చంద్రబాబు జై తెలంగాణ అంటూ దాదాపు తొలిసారి గట్టిగా నినదించారని చెప్పవచ్చు. అంతేకాదు పదే పదే ప్రజలతో తెలంగాణ నినాదాలు చేయించారు.
సాధారణ ఎన్నికలు సమీపించిన తరుణంలో తెలంగాణకు కేంద్రమైన హన్మకొండలో తెలుగుదేశం పార్టీ బుధవారం రాత్రి నిర్వహించిన ప్రజా గర్జన సభలో చంద్రబాబు జై తెలంగాణ అంటూ నినదించడం ఆ పార్టీ కేడర్‌ను ఉత్సాహపరచింది. ఇలా అనడం వ్యూహాత్మకమో మరేమోగాని చంద్రబాబు పార్టీ నాయకులను తన తెలంగాణ పలుకుల ద్వారా సంతృప్తి పరచగలిగారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి తానే తొలిమారు లేఖ రాశానని ఇది వరలో అనేక సభల్లో చెప్పినపుడు కూడా బాబు జై తెలంగాణ అనలేదని తెలంగాణవాదులు గుర్తు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంలోనూ బాబు జాగ్రత్తగా మాట్లాడేవారంటారు.
ప్రత్యేక రాష్ట్రం విభజనపై పార్లమెంటులో నిర్ణయం జరిగిన తరువాత కూడా చంద్రబాబు ఢిల్లీలోనే మకాం వేసి కేంద్రం విభజనను ఏకపక్షంగా చేసిందని చెబుతూ ఇతర పార్టీల మద్దతు కోరడం టిడిపి తెలంగాణ నాయకుల్లో ఆగ్రహాన్ని కలిగించింది. ఆ తరువాత అనేకమంది తెలంగాణ నాయకులు, పలువురు ఎమ్మెల్యేలు పార్టీని వీడారు.
ఈ నేపథ్యంలో పార్టీలో ఉన్న నాయకులను ఎన్నికల దిశగా నడిపించే ఆలోచనతోనే బాబు వరంగల్ ప్రజాగర్జన వేదిక నుండి జై తెలంగాణ అని నినదించినట్లు భావిస్తున్నారు. వేదికపై తొలిమారు తన ఫొటోతో పాటు టి-టిడిపి నేతల ఫొటోలు కూడా ఏర్పాటు చేయించి అందరిని ఆశ్చర్యపరిచారు.

చంద్రబాబు
ప్రజా గర్జన సభలో చంద్రబాబు తెరాస అధ్యక్షులు కెసిఆర్‌పై నిప్పులు చెరిగారు. గరీబుల పాలన కావాలంటే టిడిపికి ఓటువేయాలని, గడీల పాలన రావాలంటే తెరాసకు ఓటువేయవచ్చని బాబు వ్యాఖ్యానించారు.

చంద్రబాబు
కెసిఆర్ ఒక మాయల మరాఠి, మోసగాడు, అహంకారి అని ధ్వజమెత్తారు. తెలంగాణ రావడానికి ముందు కూలిగా ఉంటానని చెప్పిన ఆయన మొత్తం దోచుకున్నారని, ఇప్పుడు మేస్ర్తి అవుతానని అంటున్నాడంటే ఏమీ మిగల్చబోడన్నారు.

చంద్రబాబు
తెలంగాణ విభజన సమయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తనను అడిగే నిర్ణయంచేసిందని చెప్పిన కెసిఆర్ ఇప్పుడు తెలంగాణ విషయంలో కాంగ్రెస్ మోసగించిందని అంటున్నాడని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు
తెరాస అధికారంలోకి వచ్చాక తప్పుచేస్తే తన కూతురు, కుమారున్నైనా జైలుకు పంపుతానని కెసిఆర్ చెబుతున్నాడు... కాని ఇప్పటి వరకు ఆయన కుటుంబం చేసిన తప్పులను బయటకు తీస్తే శాశ్వతంగా వారికి జైలు జీవితమేనని చంద్రబాబు ఆవేశంగా అన్నారు.

చంద్రబాబు
కారుకు అధికారం అప్పగిస్తే ఆ కారులో కెసిఆర్, ఆయన కుటుంబం షికారు చేస్తుందే తప్ప ప్రజలను పట్టించుకోరన్నారు. కాంగ్రెస్ కూడా భ్రష్టుపట్టిన పార్టీఅని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ తుడిచి పెట్టుకుపోవడం ఖాయమన్నారు.

చంద్రబాబు
తెలంగాణ విభజన జరిగిన సమయంలో రాష్ట్రాన్ని గాడిన పెట్టాలన్నా, అన్నివిధాలుగా అభివృద్ధి చేయాలన్నా ఆ శక్తి తెలుగుదేశంకే తప్ప మరెవరికీ లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.

చంద్రబాబు
తెలంగాణ ప్రభుత్వంలో అమరుల కుటుంబాలకు రు.10లక్షల సహాయం, ఇంటికో ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. రైతు రుణమాఫీ, తొమ్మిదిగంటల వ్యవసాయవిద్యుత్, పరిశ్రమల ఏర్పాటు, వ్యవసాయ పురోగతికి కృషి చేస్తామన్నారు.

చంద్రబాబు
తెలంగాణ అనే దేవాలయం కట్టుకుంటున్నాం.. ఆలయంలో దేవుని ఫొటో పెట్టండి.. రావణాసురుని ఫొటోకాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జై తెలంగాణ అని నినాదాలు చేశారు. చంద్రబాబు జై తెలంగాణ అంటూ దాదాపు తొలిసారి గట్టిగా నినదించారని చెప్పవచ్చు.

చంద్రబాబు
అంతేకాదు పదే పదే ప్రజలతో తెలంగాణ నినాదాలు చేయించారు. సాధారణ ఎన్నికలు సమీపించిన తరుణంలో తెలంగాణకు కేంద్రమైన హన్మకొండలో తెలుగుదేశం పార్టీ బుధవారం రాత్రి నిర్వహించిన ప్రజా గర్జన సభలో చంద్రబాబు జై తెలంగాణ అంటూ నినదించడం ఆ పార్టీ కేడర్‌ను ఉత్సాహపరచింది.

చంద్రబాబు
ఇలా అనడం వ్యూహాత్మకమో మరేమోగాని చంద్రబాబు పార్టీ నాయకులను తన తెలంగాణ పలుకుల ద్వారా సంతృప్తి పరచగలిగారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి తానే తొలిమారు లేఖ రాశానని ఇది వరలో అనేక సభల్లో చెప్పినపుడు కూడా బాబు జై తెలంగాణ అనలేదని తెలంగాణవాదులు గుర్తు చేస్తున్నారు.

చంద్రబాబు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంలోనూ బాబు జాగ్రత్తగా మాట్లాడేవారంటారు. ప్రత్యేక రాష్ట్రం విభజనపై పార్లమెంటులో నిర్ణయం జరిగిన తరువాత కూడా చంద్రబాబు ఢిల్లీలోనే మకాం వేసి కేంద్రం విభజనను ఏకపక్షంగా చేసిందని చెబుతూ ఇతర పార్టీల మద్దతు కోరడం టిడిపి తెలంగాణ నాయకుల్లో ఆగ్రహాన్ని కలిగించింది.

చంద్రబాబు
ఆ తరువాత అనేకమంది తెలంగాణ నాయకులు, పలువురు ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. ఈ నేపథ్యంలో పార్టీలో ఉన్న నాయకులను ఎన్నికల దిశగా నడిపించే ఆలోచనతోనే బాబు వరంగల్ ప్రజాగర్జన వేదిక నుండి జై తెలంగాణ అని నినదించినట్లు భావిస్తున్నారు.

చంద్రబాబు
హన్మకొండలోని ప్రజా గర్జన వేదికపై తొలిసారి తన ఫొటోతో పాటు తెలంగాణ టిడిపి నేతల ఫొటోలు కూడా ఏర్పాటు చేయించడం గమనార్హం.

చంద్రబాబు
ఆ తరువాత అనేకమంది తెలంగాణ నాయకులు, పలువురు ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. ఈ నేపథ్యంలో పార్టీలో ఉన్న నాయకులను ఎన్నికల దిశగా నడిపించే ఆలోచనతోనే బాబు వరంగల్ ప్రజాగర్జన వేదిక నుండి జై తెలంగాణ అని నినదించినట్లు భావిస్తున్నారు. హన్మకొండలోని ప్రజా గర్జన వేదికపై తొలిసారి తన ఫొటోతో పాటు తెలంగాణ టిడిపి నేతల ఫొటోలు కూడా ఏర్పాటు చేయించడం గమనార్హం.












Click it and Unblock the Notifications