వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు, కెసిఆర్‌ల భద్రతపై ఇంటెలిజెన్స్ సమీక్ష: పెంపు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సార్వత్రికి ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుని నూతన ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధమవుతున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, భారతీయ జనతా పార్టీ అధినేత కె చంద్రశేఖర్ రావు భద్రతను ఇంటెలిజెన్స్ అధికారులు సమీక్షించారు.

ప్రస్తుతం జడ్ కేటగిరి భద్రతలో కొనసాగుతున్న కె చంద్రశేఖర్ రావుకు అదనపు భద్రత కల్పించనున్నారు. డిస్పీ స్థాయి అధికారి ఆయన భద్రతను సమీక్షించనున్నారు. ఇద్దరు ఇన్ స్పెక్టర్లు, ఎస్కార్ట్ వాహనాలను పెంచనున్నారు.

Chandrababu and KCR's security Strengthened by Intelligence department

సీమాంధ్రలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్న ఇంటెలిజెన్స్ అధికారులు ఆయన భద్రతను సమీక్షించారు. ప్రస్తుతం చంద్రబాబుకు జడ్ ప్లస్ కేటగిరితోపాటు ఎన్ఎస్‌జి కమాండోల భద్రత ఉందని అధికారులు తెలిపారు.

జూన్ 2న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రాలుగా ఏర్పడనున్నాయి. జూన్ 2 తర్వాతనే ఈ రెండు రాష్ట్రాల్లో నూతన ప్రభుత్వాలు ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలు ప్రభుత్వాలు ఏర్పాటు చేయనున్నాయి.

English summary
It is said that Telugudesam Party president Chandrababu Naidu and Telangana Rashtra Samithi president Chandrasekhar Rao's security Strengthened by Intelligence department.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X