జైట్లీతో మాట్లాడా, అన్నీ చెప్పారు: చంద్రబాబు, అంతా ఓకే కానీ: కెసిఆర్
విజయవాడ: కేంద్ర బడ్జెట్‌లో నవ్యాంధ్రకు అన్యాయం జరిగిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు మంగళవారం నాడు చెప్పారు. ఈ విషయమే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో తాను మాట్లాడానని చెప్పారు. అయితే, బడ్జెట్‌లో రాష్ట్రాల వారీగా కాకుండా రంగాల వారిగా కేటాయించామని జైట్లీ చెప్పారన్నారు.
పెండింగ్ ప్రాజెక్టుల పైన ఈ ఏడాదే స్పష్టత ఇస్తామని జైట్లీ తనకు చెప్పారని అన్నారు. కాపు రిజర్వేషన్ల పైన కూడా చంద్రబాబు మాట్లాడారు. కాపులకు రిజర్వేషన్లు ఇచ్చే విషయమై కసరత్తు చేస్తున్నామని తెలిపారు. పోలవరం తొలి దశ 2018 నాటికి పూర్తి చేస్తామన్నారు.
రాయలసీమ, ఉత్తరాంధ్రల సాగునీటి ప్రాజెక్టుల పైన దృష్టి సారిస్తామని చెప్పారు. నెలాఖరులోగా కృష్ణా, గోదావరి అనుసంధానం పూర్తి అవుతుందని చంద్రబాబు చెప్పారు.

కేంద్రంపై ఒత్తిడి తేవాలి: ఉత్తరాంధ్ర ఐక్య వేదిక
సాధారణ బడ్జెట్, రైల్వే బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిందని ఉత్తరాంధ్ర రాజకీయ ఐక్య వేదిక నేతలు ఆరోపించారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయడం లేదన్నారు. ఎంపీలంతా కేంద్రంపై ఒత్తిడి తేవాలని లేదంటే రాజీనామా చేయాలని నేతలు డిమాండ్ చేశారు.
సాదాసీదాగా కేంద్ర బడ్జెట్: కెసిఆర్
కేంద్ర బడ్జెట్ సాదాసీదాగా ఉందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారని సమాచారం. వ్యవసాయానికి పెద్దపీట వేసినా నిర్దిష్ట పథకాలు, రాష్ట్రాలకు కేటాయింపులపై స్పష్టత లేదన్నారు. కాళేశ్వరం తదితర రాష్ట్ర ప్రాజెక్టుల ప్రస్తావన లేకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
సోమవారం తన నివాసంలో ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్ర బడ్జెట్‌పై సమీక్షను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కెసిఆర్... టీవీలో కేంద్ర బడ్జెట్‌ను వీక్షించారు. కేంద్ర బడ్జెట్ ప్రాధాన్యాలు, తెలంగాణకు కేటాయింపులు, గ్రాంట్లు, పన్నుల్లో వాటా, బడ్జెట్‌పై ప్రభావం తదితర అంశాలపై చర్చించారు. కేంద్ర బడ్జెట్ ఆధారంగా రాష్ట్ర బడ్జెట్‌కు తుది అంచనాలను ఖరారు చేశారు.
-
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications