గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉద్యోగాలపై బాబు తీపి కబురు: జూపూడి-అనురాధకు అందలం (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ: తెలుగుదేశం పేదల పార్టీ అని, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం ఎన్టీఆర్‌ పార్టీని స్థాపించారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.

పేదలకు రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చారని, పక్కా ఇళ్లు కట్టించి ఆత్మగౌరవం కల్పించారని, ఈ పార్టీ ప్రజలలోనే ఉంటుందన్నారు.

ఆర్థిక అసమానతలు తొలగించి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరచడానికి కృషి చేస్తుందని, పేదవారు, రైతులు, సమాజం కోసమే ఈ జీవితమని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

జనచైతన్య యాత్ర

జనచైతన్య యాత్ర

మంగళవారం ఆయన గుంటూరు జిల్లా వేమూరులో పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావుతో కలసి జన చైతన్య యాత్రలను ప్రారంభించారు.

జనచైతన్య యాత్ర

జనచైతన్య యాత్ర

ఈ నెల 14వ తేదీ వరకు జరిగే యాత్రలో పార్టీ కమిటీలు ప్రభుత్వానికి, ప్రజలకు అనుసంధానకర్తలుగా వ్యవహరించాలని, ప్రజా సమస్యలు పరిష్కరించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

జనచైతన్య యాత్ర

జనచైతన్య యాత్ర

కేంద్రానికి నీతి ఆయోగ్‌ నివేదిక ఇచ్చినందున ఆ మేరకు ఏపీకి సాయం చేయాలని ప్రధాని మోడీని కోరానని చంద్రబాబు తెలిపారు.

జనచైతన్య యాత్ర

జనచైతన్య యాత్ర

వీలైనంత తొందరగా కేంద్రం సాయం అందిస్తే రాష్ట్రం ముందుకెళుతుందన్నారు. ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తోందని చెప్పారు.

జనచైతన్య యాత్ర

జనచైతన్య యాత్ర

జనవరి నెలలో జన్మభూమి కార్యక్రమం పెడతామని, ఆలోపు ఇప్పటికే ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను పరిష్కరిస్తామన్నారు.

జనచైతన్య యాత్ర

జనచైతన్య యాత్ర

ఏపీపీఎస్సీ ద్వారా త్వరలోనే ఉద్యోగ ప్రకటనలు ఇస్తామని, గ్రామాలను దత్తత తీసుకుని గ్రామస్థులతో కలసి పనిచేసి వారి జీవన ప్రమాణాలు పెంచడానికి పారిశ్రామికవేత్తలు, ఎన్నారైలు ముందుకు రావాలన్నారు.

జనచైతన్య యాత్ర

జనచైతన్య యాత్ర

వేమూరులో ముఖ్యమంత్రి జనంతో మమేకమై సంక్షేమ పథకాల అమలుపై ఆరాతీశారు. ముందుగా నిర్ణయించిన మార్గం గుండా కాకుండా ఆకస్మికంగా ఎస్సీ కాలనీకి వెళ్లి మహిళలను పలకరించారు.

జనచైతన్య యాత్ర

జనచైతన్య యాత్ర

రాజధాని నిర్మాణానికి విశ్రాంత ఉద్యోగి కోగంటి మల్లికార్జునరావు రూ.25 వేలు, అమర్తలూరు మండలం కూచిపూడికి చెందిన జాస్తి కరుణ చౌదరి కిడ్డీబ్యాంకులో దాచుకున్న సొమ్మును ముఖ్యమంత్రికి అందజేశారు.

జయరామిరెడ్డి

జయరామిరెడ్డి

ఏపీలోని వివిధ మంత్రిత్వశాఖల్లోని ఎనిమిది కార్పొరేషన్‌ల ఛైర్మన్‌ పదవులను ప్రభుత్వం మంగళవారం భర్తీ చేసింది. కార్పోరేషన్ చైర్మన్‌గా నియమితులైన జయరామిరెడ్డి (ఆర్థిక).

ఎల్వీఎస్ఆర్కే ప్రసాద్

ఎల్వీఎస్ఆర్కే ప్రసాద్

ఏపీలోని వివిధ మంత్రిత్వశాఖల్లోని ఎనిమిది కార్పొరేషన్‌ల ఛైర్మన్‌ పదవులను ప్రభుత్వం మంగళవారం భర్తీ చేసింది. ప్రసాద్‌కు గిడ్డంగుల బాధ్యతను అప్పగించారు.

పంచుమర్తి అనురాధ

పంచుమర్తి అనురాధ

ఏపీలోని వివిధ మంత్రిత్వశాఖల్లోని ఎనిమిది కార్పొరేషన్‌ల ఛైర్మన్‌ పదవులను ప్రభుత్వం మంగళవారం భర్తీ చేసింది. అనురాధకు మహిళా ఫైనాన్స్ ఇచ్చారు.

మల్లెల లింగా రెడ్డి

మల్లెల లింగా రెడ్డి

ఏపీలోని వివిధ మంత్రిత్వశాఖల్లోని ఎనిమిది కార్పొరేషన్‌ల ఛైర్మన్‌ పదవులను ప్రభుత్వం మంగళవారం భర్తీ చేసింది. లింగారెడ్డిని పౌరసరఫరాలకు నియమించింది.

వర్ల రామయ్య

వర్ల రామయ్య

ఏపీలోని వివిధ మంత్రిత్వశాఖల్లోని ఎనిమిది కార్పొరేషన్‌ల ఛైర్మన్‌ పదవులను ప్రభుత్వం మంగళవారం భర్తీ చేసింది. వర్ల రామయ్యకు గృహ నిర్మాణం ఇచ్చారు.

జూపూడి ప్రభాకర రావు

జూపూడి ప్రభాకర రావు

ఏపీలోని వివిధ మంత్రిత్వశాఖల్లోని ఎనిమిది కార్పొరేషన్‌ల ఛైర్మన్‌ పదవులను ప్రభుత్వం మంగళవారం భర్తీ చేసింది. జూపూడి ప్రభాకర రావును ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్‌గా నియమించారు.

English summary
Chandrababu kick starts Jana Chaitanya Yatra in Guntur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X