బాబు చైనా పర్యటన, నాయకత్వం వహించాలని విదేశాంగ శాఖ లేఖ
హైదరాబాద్/విశాఖ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 1 నుంచి 6వ తేదీ వరకూ చైనాలో పర్యటించనున్నారు. భారత్ నుంచి చైనా వెళ్లే ప్రతినిధుల బృందానికి నాయకత్వం వహించాల్సిందిగా విదేశాంగశాఖ ఆయనను కోరింది. చంద్రబాబు పర్యటన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ చైనా పర్యటనకు వెళ్ళనున్నారు.
తమతో సత్సంబంధాల కోసం ప్రతినిధుల బృందాన్ని పంపించాలని చైనా ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో ఈ బృందానికి నేతృత్వం వహించాలని కేంద్ర విదేశాంగ శాఖ చంద్రబాబుకు లేఖ రాసింది. దీనికి చంద్రబాబు అంగీకరించారు. ఈ నేపథ్యంలో భారత్ - చైనా సత్సంబంధాలు పెంపొందించే విషయంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించనున్నారు.
ఉత్పత్తి రంగంలో చైనాను తలదన్నాలి: వెంకయ్య

కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు శుక్రవారం విశాఖలోని రాంకీ ఫార్మాసిటీలో స్థాపించిన గ్రాన్యూల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఫార్మా కంపెనీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
భారతీయులు ఉత్పత్తి రంగంలో చైనాను తలదన్నేలా ముందుకు పోవాలన్నారు. పరిశ్రమలు, ప్రభుత్వం కలిసి పరిశోధనలపై మరింత దృష్టి పెట్టాలన్నారు. ఎగుమతులు పెంచి దిగుమతులు తగ్గించుకోవాలని, స్థానికుల్లో నైపుణ్యం పెంచి వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు.












Click it and Unblock the Notifications