Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీడీపీలో వీరికే నామినేటెడ్ పదవులు-చంద్రబాబు కండిషన్..!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు విడతలుగా నామినేటెడ్ పోస్టుల్ని భర్తీ చేసింది. ఇప్పుడు మూడో విడత పోస్టుల భర్తీ కోసం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఇవాళ తన సొంత పార్టీ టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ఆయన ఈసారి నామినేటెడ్ పోస్టులు ఎవరికో తేల్చిచెప్పేసారు. వారి పేర్లనే తనకు సూచించాలని కూడా నేతలకు క్లారిటీ ఇచ్చేశారు.

ఇవాళ టీడీపీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, పార్టీ ఇంఛార్జ్‌లతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ వ్యవహారాలు, నేతల పనితీరు వంటి అంశాలపై చర్చించారు. అలాగే ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపిలు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలన్నారు. కార్యకర్తలకు, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని ఆదేశించారు. చరిత్రలో తిరుగులేని విజయాన్ని అందించిన ప్రజలు, కార్యకర్తల ఆశలు తీర్చేందుకు, ఆకాంక్షల మేరకు ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు.

Chandrababu made mandatory CUBS membership criteria for nominated posts to tdp leaders

2029లో మళ్లీ గెలిచేలా ప్రతి ఒక్కరి పనితీరు ఉండాలని చంద్రబాబు నేతలకు సూచించారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను, పథకాలను ప్రజలకు వద్దకు తీసుకువెళ్లాలన్నారు. ప్రభుత్వ పని తీరును నిరంతరం పర్యవేక్షించుకుంటూ, మెరుగుపరుచుకుంటూ పనిచేయాలన్నారు. 7 నెలల కాలంలో ఎన్నో పథకాలు, కార్యక్రమాలు, అభివృద్ది పనులు చేపట్టామని, ఈ విషయాలను నిరంతరం ప్రజలకు వివరించాలని తెలిపారు. ఎన్నికల హామీల్లో ఇచ్చిన పథకాలన్నీ అమలు చేస్తాం...ఈ విషయంలో వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టాలన్నారు.

గత 5 ఏళ్లు కార్యకర్తలు తిరుగులేని పోరాటం చేశారని, వారి కష్టం ఫలితమే మొన్నటి ఎన్నికల విజయం అని చంద్రబాబు తెలిపారు. కార్యకర్తలను ఎప్పుడూ గౌరవించుకోవాలన్నారు. ఎన్నికలు అయిపోయాయి నేను ఎమ్మెల్యే, ఎంపి అయిపోయాను అని ఎవరూ భావించవద్దన్నారు. కష్టపడిన కార్యకర్తలు, నాయకులకు న్యాయం చేసేలా నామినేటెడ్ పదవులు ఇస్తామని తెలిపారు.

వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీల నియామకంపై ఎమ్మెల్యేలు సరైన ప్రతిపాదనలు పంపాలని కోరారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీల్లో పదవి ఆశిస్తున్న వాళ్లు క్యూబ్స్(క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్) విభాగాల్లో సభ్యులుగా ఉండాలని కండిషన్ పెట్టారు. పదవులు పొందే ప్రతి ఒక్కళ్లు పార్టీ స్ట్రక్చర్ అయిన క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్‌లో ఉండాలన్నారు. అలాంటి వారినే పదవుల కోసం నాయకులు సిఫారసు చేయాలన్నారు. ఏ స్థాయి వారు అయినా క్యూబ్స్‌లో మెంబర్‌గా ఉండాలన్నారు.

Chandrababu made mandatory CUBS membership criteria for nominated posts to tdp leaders

214 మార్కెట్ కమిటీలు ఉన్నాయని, 1100 ట్రస్ట్ బోర్డులు ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. రానున్న రోజుల్లో ఈ నియామకాలు పూర్తి చేస్తామన్నారు. జూన్‌లోపు ప్రభుత్వంలో ఉన్న అన్ని నామినేటెడ్ పదవులు పూర్తి చేస్తామన్నారు.పదవి పొందిన వాళ్ల రెండేళ్ల పనితీరుపై సమీక్ష చేస్తామని, దాని ఆధారంగా మళ్లీ నిర్ణయాలు, భవిష్యత్ అవకాశాలు ఉంటాయన్నారు. మెంబర్ షిప్ బాగా చేసిన వారికి పదవుల్లో ప్రోత్సాహం ఇస్తామన్నారు. మంత్రులు జిల్లాల్లో ఎమ్మెల్యేలతో కూర్చుని పార్టీ అంశాలపై చర్చించాలని, సమస్యలు పరిష్కరించాలని చంద్రబాబు ఆదేశించారు.

ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు చెల్లించేలా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు పని చేయాలన్నారు. ఇతర పార్టీల నుంచి నిన్న మొన్న వచ్చి చేరిన వారి కంటే, ఎప్పటి నుంచో పార్టీలో ఉండి పనిచేసిన వారిని నేతలు ప్రోత్సహించాలన్నారు.మొదటి నుంచి పార్టీని నమ్మకున్న వారికే పదవులు దక్కేలా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదే అన్నారు. ప్రజల్లో సంతృప్తి ఉండాలని, భవిష్యత్‌పై నమ్మకం, భరోసా కలగాలని, ఇదే కూటమి ప్రభుత్వ విధానం అని తెలిపారు. ఇప్పుడు ప్రజలకు ఏం చేస్తాం...భవిష్యత్ లో ఏం ఇస్తాం అనేది ప్రజలకు పార్టీ నేతలు వివరించాలన్నారు.పథకాలన్నీ ఇస్తాం...వైసీపీ తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టాలని సూచించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+