చంద్రబాబు ఆ నిర్ణయం తీసుకుంటే 31మంది పంట పండినట్టే!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం కొలుపు తీరిన విషయం తెలిసిందే. ఎన్నికలలో టిడిపి ఘనవిజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పాలనాపగ్గాలు చేపట్టింది. అయితే ఈసారి కొత్త పంధాలో పాలన నిర్వహిస్తున్న చంద్రబాబు అటు పాలనలోనే కాకుండా, పార్టీలో కీలకంగా పని చేసిన నాయకులకు, పొత్తులలో భాగంగా తమకు రావలసిన సీట్లు త్యాగం చేసిన నాయకులకు తగిన అవకాశాలు కల్పించే ప్లాన్ లో ఉన్నారు.

వాళ్ళపై చంద్రబాబు స్పెషల్ ఫోకస్
గత ఎన్నికల్లో టిడిపి, కూటమి విజయం వెనుక సీట్లను త్యాగం చేసిన టిడిపి నాయకుల కష్టం కూడా ఉందని గుర్తించిన చంద్రబాబు మొత్తం 31 మంది నాయకులకు సముచిత స్థానం కల్పించడానికి దృష్టి సారిస్తున్నారని సమాచారం. ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ 175 స్థానాలకు 144స్థానాలలో పోటీ చేసింది. పొత్తుల లో భాగంగా మిగతా 31 స్థానాలలో 21 స్థానాలు జనసేనకు కేటాయించి, 10 స్థానాలను బిజెపికి ఇచ్చింది.

Chandrababu master plan for 31 TDP leaders who sacrificed their seats

కూటమి విజయం కోసం కీలకంగా సీట్లు త్యాగం చేసిన నేతలు
దీంతో 31 నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి లకు ఎన్నికలలో పోటీ చేసే అవకాశం రాలేదు. పార్టీ కోసం కష్టపడినా టికెట్ రాకపోవటంతో కాస్త నిరాశకు గురైనప్పటికీ నాయకులు అందరూ తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు మాటకు కట్టుబడి కూటమి విజయం కోసం కీలకంగా పనిచేశారు.

వారికి నామినేటెడ్ పదవులకు రంగం సిద్ధం
పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయం కోసం టిడిపి ఇన్చార్జి వర్మ ఇన్చార్జి వర్మ మాత్రమే కాదు మిగతా నియోజకవర్గాలలోను కూటమి అభ్యర్థులకు ఓట్లు పడడం కోసం టిడిపి నుంచి టికెట్ వదులుకున్న నేతలు ఎంతగానో శ్రమించారు. ఇక ఇప్పుడు ఈ 31 మందికి నామినేటెడ్ పదవులు ఇవ్వడానికి చంద్రబాబు రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది.

పార్టీ కోసం కష్టపడిన వారికి చంద్రబాబు న్యాయం
పార్టీ కోసం కష్టపడిన వాళ్లకి కచ్చితంగా గుర్తింపు ఉంటుందని ఇప్పటికే అనేక సార్లు చెప్పిన చంద్రబాబు నామినేటెడ్ పదవులతో పాటు, రాజ్యసభ, శాసనమండలిలో ఖాళీ అయ్యే స్థానాలను స్వీట్లు కోల్పోయిన నేతలకు ఇవ్వాలనే ప్లాన్లో ఉన్నారని సమాచారం. ఈ మేరకు చంద్రబాబు ఇంటర్నల్ గా కసరత్తు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈసారి తన హయాంలో కష్టపడిన ఏ నాయకుడికీ అన్యాయం జరగకూడదని భావిస్తున్న చంద్రబాబు పార్టీ నేతలకు పదవుల విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించనున్నట్టు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+