ఢిల్లీలో బాబు బిజీ: విభజన సమస్యలపై కేంద్ర మంత్రులతో భేటీ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారంనాడు కూడా దేశ రాజధాని ఢిల్లీలో బిజీగా గడిపారు. ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలుసుకుని రాష్ట్ర విభజన సమస్యలపై చర్చించారు. తమ రాష్ట్రానికి తగిన సహాయం అందించాలని కోరారు. సోమవారంనాడు జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతిని కలిసి పోలవరం ప్రాజెక్టుపై చర్చించిన ఆయన మంగళవారంనాడు ముగ్గురు కీలకమైన కేంద్ర మంత్రులను కలుసుకున్నారు.
మంగళవారం ఉదయం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమయ్యారు. తమ రాష్ట్రానికి అందించాల్సిన ఆర్థిక సహాయంపై ఆయన జైట్లీతో మాట్లాడినట్లు సమాచారం. ఆ తర్వాత కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. ఎపికి ప్రత్యేక హోదా, అమరావతి రాజధాని నిర్మాణం వంటి విషయాలపై ఆయన రాజ్‌నాథ్ సింగ్‌తో మాట్లాడినట్లు సమాచారం. ఆ తర్వాత కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కూడా సమావేశమయ్యారు.

ఆయన మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మిస్తామని ఆయన చెప్పారు. మీడియా సంచలన వార్తలకే ప్రాధాన్యం ఇస్తోందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన వల్ల తలెత్తిన సమస్యలను పరిష్కరించాలని రాజ్‌నాథ్ సింగ్‌ను కోరినట్లు ఆయన తెలిపారు.
నీతి ఆయోగ్ సమావేశానికి చంద్రబాబు సమన్వయకర్తగా వ్యవహరించారు. ప్రత్యేక హోదాపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన దాని గురించి కేంద్ర మంత్రులతో మాట్లాడినట్లు చెబుతున్నారు. అలాగే, రాజధాని కోసం తలపెట్టిన భూసేకరణపై కూడా ఆయన మాట్లాడినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications