గవర్నర్‌తో భేటీ: ప్యాకేజీ, అసెంబ్లీ, విస్తరణపై వివరించిన బాబు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం ఉదయం రాజ్‌భవన్‌లో సమావేశమయ్యారు. గవర్నర్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి, శాలువా కప్పి, డ్రై ఫ్రూట్స్ బాక్స్ అందించిన చంద్రబాబు.., ఆయనతో పలు విషయాలను చర్చించారు.
ఈ సమావేశం సుమారు గంటకుపైగా సాగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు, అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలు, రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ, తదితర అంశాలపై చంద్రబాబు గవర్నర్‌తో చర్చించారు. మంత్రివర్గ విస్తరణపై కూడా ఈ సందర్భంగా చర్చించినట్లు సమాచారం.

కేంద్రం ప్రత్యేక హోదాను ఇచ్చే పరిస్థితి లేదని స్పష్టం చేస్తూ, దానికి ప్రతిగా ప్యాకేజీని ఇస్తామని చెప్పిన తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపైనే వీరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఆపై మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాల వివరాలను, జీఎస్టీ బిల్లుకు ఆమోదం తదితర విషయాలను నరసింహన్ వద్ద చంద్రబాబు ప్రస్తావించారని సమాచారం.
అమరావతి నిర్మాణానికి పాటిస్తున్న స్విస్ చాలెంజ్ విధానంపై కోర్టులో నడుస్తున్న కేసుల గురించి కూడా గవర్నర్ కు చంద్రబాబు వివరించినట్టు తెలిసింది.












Click it and Unblock the Notifications