• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తప్పు! ఏపీ తెలంగాణ కలవవ్: బాబు, మోడీ హామీ

By Srinivas
|

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం నాడు ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ప్రత్యేక హోదా పైన ఆలస్యం వద్దని, రాజధాని నిర్మాణానికి నిధులు సమకూర్చాలని కోరారు. విభజన చట్టంలోని హామీలు నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఏపీని ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

ఏపీ, టీ రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై కొద్ది రోజుల్లో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తానని చంద్రబాబుకు ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. ఆదివారం ప్రధాని నివాసానికి వెళ్లిన చంద్రబాబు విభజన సమస్యలపై ఆయనతో చర్చించారు.

ఈ సందర్భంగా, సాగర్‌ జలాల సమస్యపై ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య ఘర్షణ జరిగిన విషయాన్ని ప్రధాని ప్రస్తావించినట్లు తెలిసింది. ఈ అంశంలో ఇరు రాష్ట్రాలు చాలా బాగా సమస్యను పరిష్కరించుకున్నాయని, ఇదే సామరస్య ధోరణితో అన్ని సమస్యలనూ వివాదాలకు తావివ్వకుండా పరిష్కరించుకోవాలని సూచించారని తెలుస్తోంది.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం, ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడం, తాజాగా ఇచ్చిన పారిశ్రామిక రాయితీలు తదితర అంశాలను చంద్రబాబు ప్రస్తావించగా.. అన్నింటినీ సానుకూలంగా పరిష్కరిస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారని సమాచారం. ప్రధానిని కలిసిన వారిలో చంద్రబాబుతోపాటు కేంద్ర మంత్రి సుజనా చౌదరి కూడా ఉన్నారు. రాష్ట్ర సమస్యలపై ప్రధాని దృష్టి కేంద్రీకరించారని, త్వరలో ఇవన్నీ పరిష్కారమవుతాయని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

 చంద్రబాబు

చంద్రబాబు

ప్రధానిగా ఆయన దేశంలోని అన్ని రాష్ట్రాల సమస్యలను పట్టించుకోవాల్సి ఉంటుందని, ఒకే రాష్ట్రంపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించలేరని చెప్పారు. ప్రధానితో భేటీ అయి వచ్చిన తర్వాత విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ కొత్తగా ఏర్పడిందని, దానిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ పలు సమస్యలను ఎదుర్కొంటోందని మోడీకి వివరించానని చంద్రబాబు చెప్పారు.

 చంద్రబాబు

చంద్రబాబు

రాజధాని లేకపోవడం, పలు ప్రతిష్ఠాత్మక సంస్థలు హైదరాబాద్‌లోనే కేంద్రీకృతం కావడం.. కొత్త రాష్ట్రంలో ఏర్పడాల్సిన పారిశ్రామిక సదుపాయాలకు ప్రోత్సాహకాలు కల్పించాల్సి ఉండడం, నిధుల లోటు మొదలైన అనేక సమస్యలు ఉన్నాయని ప్రధానికి వివరించానని చెప్పారు. ఇతర రాష్ట్రాల కంటే భిన్నంగా ఆంధ్రప్రదేశ్‌ గురించి ఆలోచించాల్సి ఉంటుందని తాను వివరించినప్పుడు ప్రధాని అంగీకరించారని, త్వరలో ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం లభించేలా చూస్తానని హామీ ఇచ్చారని చంద్రబాబు చెప్పారు.

 చంద్రబాబు

చంద్రబాబు

కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, అరుణ్‌జైట్లీలతోనూ ఆయన ప్రత్యేకంగా భేట అయ్యారు. కాగా, విభజన సమస్యలపై హోం శాఖ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటైనా 8నెలలుగా ఎలాంటి పరిష్కారాలూ సూచించలేదని, ఈ నేపథ్యంలోనే టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాల్సి వచ్చిందని చంద్రబాబుతోపాటు ప్రధానిని కలిసిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి తెలిపారు.

 చంద్రబాబు

చంద్రబాబు

భారతీయ యువతకు మంచి భవిష్యత్తు ఉందని చంద్రబాబు అన్నారు. ఆదివారం ఆంధ్రా ఎడ్యుకేషనల్ సొసైటీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

 చంద్రబాబు

చంద్రబాబు

ఢిల్లీలోని తెలుగువారికి ఏపీ ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు. ఢిల్లీలోనే కాదు ప్రపంచస్థాయిలో తెలుగువారికి తెలుగు భాషకు గుర్తింపు తెచ్చిన యుగపురుషుడు ఎన్టీఆర్ అని చంద్రబాబు చెప్పారు.

 చంద్రబాబు

చంద్రబాబు

ఢిల్లీలో తెలుగుభాష, సంస్కృతిని కాపాడుతున్నారని కొనియాడారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తదితరులను ప్రస్తావిస్తూ ప్రపంచవ్యాప్తంగా తెలుగు సంస్థల్లో తెలుగువారిది కీలకపాత్ర అన్నారు.

 చంద్రబాబు

చంద్రబాబు

ఉమ్మడి ఏపీలో హైదరాబాదును అభివృద్ధి చేసినట్లే ఏపీని అభివృద్ధి చేస్తానని చంద్రబాబు చెప్పారు. తెలుగు రాష్ట్రాలు మళ్లీ కలిసే అవకాశం లేదని, అయితే రెండు రాష్ట్రాలు ఎంతో అభివృద్ధి చెందుతాయన్నారు. రెండు రాష్ట్రాలు కలిసిపోతాయని కొంతమంది వక్రీకరిస్తున్నారన్నారు.

English summary
AP Chief Minister N Chandrababu Naidu met Prime Minister Narendra Modi in New Delhi on Sunday and impressed upon him the need to implement all provisions of the AP Reorganisation Act.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X