ప్రత్యేక హోదాపై ఒత్తిడి!: బిజీ, మోడీకి చేయిచ్చిన బాబు (పిక్చర్స్)
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశ రాజధాని ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. రెండు రోజులుగా ఆయన ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. విభజనచట్టంలోని హామీల మేరకు తమ రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు.

గురువారం నాడు చంద్రబాబు పలువురు మంత్రులను కలిశారు. కేంద్రమంత్రి ఉమాభారతి తదితరులను కలిశారు. శుక్రవారం ఉదయం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయితీలపై జైట్లీతో చర్చించారు.
విభజన చట్టం ప్రకారం ఇచ్చిన హామీల మేరకు రాష్ర్టాలకు రావాల్సిన నిధుల అంశాన్ని అరుణ్ జైట్లీ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం రక్షణమంత్రి మనోహర్ పారికర్‌తో బాబు సమావేశమయ్యారు. అనంతరం నితిన్ గడ్కరీతో సమావేశం కానున్నారు.

కేంద్రమంత్రులు అశోక్‌గజపతిరాజు, సుజనాచౌదరి, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తదితరులు చంద్రబాబు వెంట ఉన్నారు. గురువారం నాడు చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య పలు విషయాలు చర్చకు వచ్చాయి. ప్రత్యేక హోదా అంశం వారి మధ్య చర్చకు వచ్చింది.












Click it and Unblock the Notifications