మోడీతో చంద్రబాబు భేటీ, వెంట సుజన: కొత్త గవర్నర్లు వస్తారా?
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం సాయంత్రం కలిశారు. ఓటుకు నోటు వ్యవహారం నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రధాని మోడీ వద్దకు చంద్రబాబుతో పాటు పలువురు కేంద్రమంత్రులు వెళ్లారు. కేంద్రమంత్రులు సుజనా చౌదరి, ఎంపీలు కొనకళ్ల నారాయణ, కొడాలి నాని, సీఎం రమేష్ తదితరులు ఉన్నారు.
సెక్షన్ 8ను సమగ్రంగా అమలు చేయాలని చంద్రబాబు మోడీని కోరినట్లుగా తెలుస్తోంది. అలాగే, ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి సమగ్ర నివేదిక అందించినట్లుగా తెలుస్తోంది.

కేంద్ర హోంశాఖ కార్యదర్శితో ఏపీ డీజీపీ, సీఎస్ భేటీ
కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోయల్‌తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ, సీఎస్ భేటీ అయ్యారు.
రాష్ట్రపతికి గవర్నర్ నివేదిక
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో నెలకొన్న రాజకీయ సంక్షోభం తదితర పరిణామాల పైన గవర్నర్ నరసింహన్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి నివేదిక ఇచ్చారు. రాష్ట్ర విభజన అనంతరం సమస్యలున్న అంశాల గురించి కూడా ఆయన చర్చించారని సమాచారం.
తన పైన వస్తున్న విమర్శల గురించి కూడా ప్రణబ్ వద్ద గవర్నర్ ప్రస్తావించారని తెలుస్తోంది. గవర్నర్ నరసింహన్ సాయంత్రం ఐదు గంటల తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌తో భేటీ కానున్నారు. కాగా, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌గా నరసింహన్‌ను తొలగించి, రెండు రాష్ట్రాలకు వేర్వేరు గవర్నర్లను నియమించే అవకాశాలున్నాయని సమాచారం.












Click it and Unblock the Notifications