జగన్ ప్రతిపక్ష హోదాపై తేల్చేసిన బాబు..! కీలక వ్యాఖ్యలు.. !
ఏపీలో కూటమి ప్రభుత్వం అందరి ప్రభుత్వమని, అన్ని వర్గాల ప్రభుత్వమని, అందరి జీవితాలు మార్చే ప్రభుత్వమని సీఎం చంద్రబాబు తెలిపారు. అనంతపురంలో నిర్వహిస్తున్న సూపర్ సిక్స్-సూపర్ హిట్ సభలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ దసరాకు కానుక ఇస్తున్నారని, జీఎస్టీ సంస్కరణలు తెచ్చారని, ధరలను తగ్గిస్తున్నారని చంద్రబాబు తెలిపారు. పన్నులను తగ్గించడం వంటి మంచి నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీని అభినందించాలన్నారు.
కూటమి ప్రభుత్వం యూనివర్సల్ హెల్త్ స్కీం తెచ్చిందని, దీంతో పేదల వైద్య ఖర్చులు తగ్గుతాయని చంద్రబాబు తెలిపారు.
మెడికల్ కాలేజీలంటే తెలియని నాయకుడు, తానేదో పొడిచేశానని మాట్లాడుతున్నాడన్నారు. భూమి ఇస్తే మెడికల్ కాలేజీ అయిపోదని, రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు తెచ్చిన ప్రభుత్వం టీడీపీనే అన్నారు. 17 కాలేజీలు ఉంటే ఒక్క కాలేజీ మాత్రమే పూర్తి అయిందన్నారు. ఫౌండేషన్ వేయడం, రిబ్బన్ కట్ చేయడం, తానేదో చేశానని చెప్పుకుంటున్నారని ఆక్షేపించారు. అసెంబ్లీకి రండి మెడికల్ కాలేజీలపై చర్చిద్దామని జగన్ కు సూచించారు.

బీసీ సోదరులను ఆదుకునేందుకు నేతన్నలకు విద్యుత్ రాయితీలు ఇస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. మత్స్య కారులకు ఆర్థిక సాయం, కల్లుగీత కులాలకు మద్యం షాపుల్లో 10 శాతం కేటాయింపులు చేస్తున్నామన్నారు.నాయీ బ్రాహ్మణులకు జీతాలు పెంపుతో పాటు సెలూన్ లకు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు తెలిపారు. సోలార్ రూఫ్ టాప్ లో ప్రత్యేక సబ్సిడీ ఇస్తున్నామన్నారు.
అర్చకులు, ఇమామ్, మౌజన్లు, పాస్టర్లకు గౌరవ వేతనం పెంచామన్నారు. ఎస్సీ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన వర్గీకరణను ఎవరికీ నష్టం లేకుండా పూర్తి చేశామని, ఎస్టీల జీవన ప్రమాణాలు పెంచుతున్నామని వివరించారు. సామాజిక న్యాయం తమ ధ్యేయం అన్నారు.
రాష్ట్రంలో వైసీపీ ఉనికి కోల్పోతోందని, అందుకే ఫేక్ రాజకీయాలతో ప్రజలను మోసం చేయాలి చూస్తోందని చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వ కార్యక్రమాలకు అడ్డుతగులుతోందన్నారు. అసెంబ్లీకి రాకుండా పార్టీ ఆఫీసులు మూసుకుని సోషల్ మీడియా ఆఫీసులు తెరిచారన్నారు. సిద్దం సిద్ధం అని ఎగిరిపడిన వాళ్లను, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అంటే... కిక్కురుమనడం లేదన్నారు. రాజకీయాల్లో ఓనమాలు తెలియని వాళ్లు ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నారన్నారు.
ప్రజలు ప్రతిపక్ష హోదా ఇస్తారని,తనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది ప్రజలేనని తెలిపారు. ప్రజలంతా ఆ నాయకుడికి క్లాస్ తీసుకోవాలన్నారు. ప్రతిపక్ష హోదా లేకున్నా... అసెంబ్లీకి వెళ్లాలని ప్రజలంతా చెప్పాలన్నారు. ఇలాంటి వాళ్లు రాజకీయాల్లో ఉండడానికి అర్హులా..అని ప్రశ్నించారు. శాసన సభకు రాకుండా రప్పా రప్పా అని రంకెలు వేస్తున్నారని,వీళ్ల తీరు మారలేదని చంద్రబాబు విమర్శించారు. రప్పా రప్పా అంటే చూస్తూ ఊరుకోమని, ఇక్కడ ఉంది సీబీఎన్, పవన్ కళ్యాణ్ అన్నారు.
సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టి తప్పించుకోలేరన్నారు. పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికల్లో ప్రజలే వాళ్లకు రప్పా రప్పా అని బెండు తీశారన్నారరు.












Click it and Unblock the Notifications