రెండుగా ఉన్న హైదరాబాద్‌ను నేనే 3గా చేశా, గర్వంగా ఉంది: బాబు, మోడీకి గట్టిగా చెప్పా
విజయవాడ: హైదరాబాద్ నగరం రెండుగా ఉండేదని, అలాంటి నగరానికి సైబరాబాద్‌ను నిర్మించి తానే మూడుగా చేశానని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కాంగ్రెస్ నేత దేవినేని నెహ్రూ టిడిపిలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. హైదరాబాదును నేనే అభివృద్ధి చేశానని, అక్కడి భవంతులు చూస్తే గర్వంగా ఉందన్నారు.
హైదరాబాద్ నగరం.. హైదరాబాద్, సికింద్రాబాద్ ఉంటే సైబరాబాద్‌ను నేనే చేశానని చెప్పారు. అలాగే విజయవాడ, గుంటూరు.. ఇలా అమరావతిని అభివృద్ధి చేస్తానని చెప్పారు. అన్ని కాలువలను బాగా చేస్తే, విజయవాడ రూపు ఎంతో అద్భుతంగా మారుతుందన్నారు. అలా చేస్తానని చెప్పారు. మనకు ఎన్నో వనరులు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుందామన్నారు.
ఒకప్పుడు విజయవాడ మామూలు సిటీ అని, ఇప్పుడు రాజధాని అని, భవిష్యత్తులో ప్రపంచంలో మొదటి స్థానానికి ఎదగాలన్నారు. ఒకప్పుడు విజయవాడ నుంచి అవకాశాల కోసం వివిధ దేశాలకు, రాష్ట్రాలకు వెళ్లేవారని, ఇప్పుడు విజయవాడకు వస్తున్నారన్నారు. వేరేవాళ్లు కూడా విజయవాడకు వస్తున్నారన్నారు.

ప్రపంచ అగ్రనగరాల్లో మన నగరం
ప్రపంచంలోని అగ్రనగరాల్లో మన అమరావతి.. విజయవాడ ఉంటుందని చంద్రబాబు చెప్పారు. మొన్ననే కృష్ణా పుష్కరాలు ఘనంగా నిర్వహించుకున్నామని, విజయవాడ ప్రపంచానికి తెలిసిందన్నారు. రాజధానికి రైతులు సంతోషంగా భూములు ఇచ్చారని కితాబిచ్చారు. మనం కట్టుబట్టలతో హైదరాబాద్ వచ్చామన్నారు.
విపక్షాలైన వైయస్సార్ కాంగ్రెస్, కొంతమంది కాంగ్రెస్ నాయకులు రైతులు రాజధానికి భూములు ఇస్తే కుప్పిగంతులు వేశారన్నారు. రాజధాని భూసేకరణలో అన్యాయం జరిగిందని చెప్పడం విడ్డూరమన్నారు. సింగపూర్‌లో అవినీతి ఉండదని, అలాంటి దేశం నుంచి కంపెనీలు తెచ్చుకున్నామన్నారు. వారు అవినీతికి పాల్పడితే మళ్లీ వారికి పనులు ఉండవన్నారు.
మోడీకి గట్టిగా చెప్పా
తాను ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కేంద్రాన్ని పలుమార్లు కలుస్తాన్నానని చెప్పారు. ఇప్పటి దాకా మనకు ఇచ్చిన హామీలను వారు నెరవేర్చలేకపోయారని చెప్పారు. ఇప్పుడు నెరవేరుస్తున్నారని చెప్పారు. తాను ఢిల్లీలో కేంద్రాన్ని కలిసి.. మనం కలిసి ఏపీకి హామీ ఇచ్చామని, దానిని నెరవేర్చాల్సిన బాధ్యత మన పైన ఉందని వారిక గట్టిగా చెప్పానన్నారు.












Click it and Unblock the Notifications