చంద్రబాబు కియా కార్ల పరిశ్రమ తెస్తే వైసీపీ తరిమేయాలని చూసింది, సవిత

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కృషి వల్లనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతోందని ఆ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. 2014- 2019 మధ్య కాలంలో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు కృషి వల్లనే కొరియా నుంచి కియా కార్ల పరిశ్రమ ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో స్థాపించారని మంత్రి సవిత గుర్తు చేశారు.

చంద్రబాబు సీఎం కాకముందు ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలకు ఉపాధి కోసం హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాలకు వెళ్లేవానని మంత్రి సవిత గుర్తు చేశారు, అనంతపురం జిల్లాలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి, రాష్ట్రానికి పరిశ్రమలు రప్పించడంలో భాగంగా చంద్రబాబు కృషి చేశారని, ఆయన వలనే కియా కార్ల పరిశ్రమ ఇక్కడ స్థాపించారని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు.

Chandrababu Naidu brought Kia car industry to Anantapur district

కియా కార్ల పరిశ్రమ ఇక్కడ స్థాపించడంతో స్థానిక యువతకి ఉద్యోగాలు వచ్చాయని, అందరూ ఈరోజు సంతోషంగా ఉన్నారని మంత్రి సవిత వివరించారు. కియా కార్ల పరిశ్రమ ఇక్కడ ఏర్పాటు కావడంతో ముందు ఇక్కడ ఎకరా భూమి రూ. 10 లక్షలు ఉండేదని, ఇప్పుడు ఎకరా భూమి రెండు కోట్ల రూపాయలు అయ్యిందని మంత్రి సవిత గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ కు కియా కార్ల పరిశ్రమ తీసుకు వచ్చారని మంత్రి సవిత అన్నారు.

అయితే తరువాత ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఇదే కియా కార్ల పరిశ్రమను ఇక్కడి నుండి పంపించడానికి అనేక ప్రయత్నాలు చేసిందని, వారి ప్రయత్నాలు ఫలించలేదని మంత్రి సవిత అన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా పెనుకొండ నియోజకవర్గంలో అనేక పాఠశాలలు, కాలేజీలో అభివృద్ధికి కియా ఇండియా కృషి చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వివరించారు.

వీటితోపాటు కియా రైతులకు పండ్ల మొక్కలను అందజేసి వారు ఆర్థికంగా పైకి రావడానికి కియా ఇండియా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తోందని మంత్రి సవిత గుర్తు చేశారు. ఇక్కడ ఉన్న కియా ఇండియా అధికారులు ప్రజలను అన్నిరకాలుగా ఆదుకుని పలు ప్రాంతాల్లోని పారిశ్రమికవేత్తలకు ఆదర్శంగా నిలిచారని మంత్రి సవిత వివరించారు. సత్యసాయి జిల్లాలోని పెనుకొండ మండలంలోని దుద్దేబండ గ్రామంలో కియా ఇండియా ఆధ్వర్యంలో సీఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా అంగనవాడి కేంద్రాన్ని నిర్మించడానాకి మంత్రి సవిత ఇదే సందర్బంలో భూమి పూజ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+