ఏపీకి హోదా కోసం చంద్రబాబు వ్యూహాం: ఎంపీలతో రేపు అత్యవసర భేటీ

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వలేమని కేంద్రం తేల్చిన నేపథ్యంలో ఏపీలో ఒక్కసారిగా రాజకీయాలు వెడెక్కాయి. ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ కేంద్రంపై ఒత్తిడి పెంచాలని టీడీపీ భావిస్తోంది. శుక్రవారం రాజ్యసభలో జరిగిన పరిణామాలపై శనివారం ఉదయం సమీక్ష చేసిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు పార్టీ ఎంపీలు, సీనియర్లతో ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలో ఆదివారం ఉదయం 10 గంటలకు విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో టీడీపీ ఎంపీలు, పార్టీకి చెందిన సీనియర్ నేతలతో సమావేశం చంద్రబాబు కానున్నారు. ఈ సమావేశానికి పార్టీకి చెందిన అందరు ఎంపీలు హాజరు కావాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

Chandrababu naidu called meeting with mps and party senior leaders tomorrow

ఈ సమావేశంలో ఏపీ రాష్ట్ర ప్రయోజనాలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై చర్చించనున్నారు. దీంతో పాటు ఏపీకి ప్రత్యేకహోదా సాధించే వరకు పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాంపై కూడా చర్చించనున్నారు. ఏపీకి హోదా ఇవ్వబోమని బీజేపీ తేల్చిన నేపథ్యంలో కేంద్రంలో కలిసి సాగుదామా? వద్దా? అన్న దానిపై కూడా చంద్రబాబు ఎంపీలతో చర్చించి అభిప్రాయం తీసుకోనున్నట్లు తెలిసింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TDP President, Andhra pradesh cheif minister Chandrababu naidu called meeting with mps and party senior leaders tomorrow at Vijaysawada.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి