బాబు మొరాయింపు: బలవంతంగా చికిత్స (ఫొటోలు)
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి శనివారం సాయంత్రం వైద్యులు బలవంతంగా చికిత్స అందించారు. అంతకు ముందు ఫ్లూయిడ్స్ ఎక్కించుకోవడానికి ఆయన నిరాకరించారు. రాష్ట్ర విభజన తీరును నిరసిస్తూ ఆయన దీక్షను చేపట్టిన విషయం తెలిసిందే. ఆయన రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో తన నిరాహార దీక్షను కొనసాగించారు. ఆయన దీక్ష శనివారానికి ఆరో రోజుకు చేరుకుంది.
ఢిల్లీలోని ఎపి భవన్ ఆవరణలో పోలీసులు ఆయన దీక్షను శుక్రవారంనాడు భగ్నం చేశారు. ఆయనను బలవంతంగా రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. సెలైన్ ఎక్కించుకునేందుకు చంద్రబాబు మొరాయిస్తున్నారు.
ఇదిలావుంటే, ఏపీభవన్ నుంచి తమ పార్టీ అధినేత చంద్రబాబును తొలగించినందుకు నిరసనగా శనివారం యుపిఎ చైర్‌పర్సన్ సోనియా గాంధీ నివాసం ముట్టడికి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులతో తెలుగుదేశం కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో తోపులాట జరిగింది.

ఆస్పత్రిలో సెలైన్‌కు బాబు నో..
రాష్ట్ర విభజన తీరును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. ఆయన సెలైన్ ఎక్కించుకోవడానికి నిరాకరిస్తున్నారు.

కీటోన్ బాడీ పెరిగే ప్రమాదం...
చంద్రబాబులోని కీటోన్ బాడీ 3 కన్నా ఎక్కువగా ఉందని, దీక్ష ఇలాగే కొనసాగిస్తే కీటోన్ బాడీ ఇంకా పెరిగి కిడ్నీలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని వైద్యులు అంటున్నారు.

పరిస్థితిని వివరిస్తున్న వైద్యులు..
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఆరోగ్యం గురించి, చికిత్స తీసుకోవాల్సిన అవసరం గురించి వైద్యులు సూచించారు. అయినా సెలైన్ ఎక్కించుకోవడానికి నిరాకరించారు.

చంద్రబాబును పరీక్షించిన వైద్యులు..
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. సెలైన్ తీసుకోకపోతే ప్రమాదమని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications