బీజేపీ-జగన్ ‘పొత్తు’పై బాబు సంచలనం: ‘కుడిచేయి పనిచేయడం లేదు’
అమరావతి: మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీ పొత్తుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నేతల విమర్శలపై కొంత ఘాటుగానే స్పందించారు.
తమ ప్రభుత్వం, పార్టీపై విమర్శల అంశంపై బీజేపీనే వారి పార్టీ నేతలను కట్టడి చేయాలని, దీనిపై వారు ఆలోచించుకుంటే మంచిదని హితవు పలికారు.

అందుకే మాట్లాడను
తాను తమ వాళ్లను బీజేపీపై విమర్శలు చేయకుండా కట్టడి చేస్తున్నానని, మిత్ర ధర్మ వల్ల తాను మాట్లాడటం లేదని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. బీజేపీ మాత్రం అలా చేయడం లేదని అన్నారు.
Recommended Video


ఓ నమస్కారం పెట్టండి..
తాము వద్దనుకుంటే ఓ నమస్కారం పెట్టాలని చంద్రబాబునాయుడు బీజేపీకి సూచించారు. అప్పుడు ఏదైనా మాట్లాడవచ్చని బీజేపీ నేతలకు తేల్చి చెప్పారు. ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించే సమస్యలపై కూడా విమర్శలు చేయడం సరికాదని అన్నారు

జగన్! మాట మీద నిలబడే వ్యక్తేనా?
ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీతో పొత్తుకు సిద్ధమని వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపైనా సీఎం చంద్రబాబు స్పందించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రం వద్ద ప్రత్యేక హోదా అంశం ఎందుకు ప్రస్తావించడం లేదని చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. జగన్ ఏ మాట మీదా నిలబడడని, ప్రత్యేక హోదా కోసం ఎంపీలతో రాజీమా చేయిస్తా అన్నాడని.. కానీ చేయించలేదని చంద్రబాబు చెప్పారు.

కేసుల నుంచి బయటపడేందుకే..
స్వప్రయోజనాల కోసం జగన్ బీజేపీకి దగ్గరవ్వాలని చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇచ్చినపుడు ప్రత్యేక హోదా జగన్‌కు గుర్తుకు రాలేదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. కేసుల నుంచి బయటపడటానికి, అక్రమ ఆస్తులు కాపాడుకోవడటానికి జగన్ చేసే ప్రయత్నాల్లో ఇదొకటని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

ఆ అవినీతి సొమ్ము వెనక్కి తీసుకుంటాం
అవినీతిపరుల ఆస్తులన్నీ ఇకపై ప్రజలకు చెందాలని జగన్ అక్రమాస్తుల గురించి ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. బీహార్, ఒరిస్సా తరహాలో అవినీతి ఆరోపణలతో దోచుకున్న సొమ్మంతా వెనక్కు తీసుకుంటామని సీఎం చంద్రబాబు చెప్పారు. అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు తిరిగి ఇప్పిస్తున్నామని ఆయన చెప్పారు.

నా కుడిచేయి పనిచేయకున్నా..
తాను అనారోగ్యంగా ఉన్నా దావోస్ పర్యటనకు వెళ్లానని సీఎం చంద్రబాబు చెప్పారు. తన కుడి చేయి సరిగా పనిచేయడం లేదని, ఇప్పటిదాకా పదిసార్లు ఫిజియోథెరపీ చేయించుకున్నానని తెలిపారు. తీవ్ర అస్వస్థతతో ఉన్న తనను డాక్టర్లు దావోస్ వెళ్ళొద్దని చెప్పారని, అయినా వినకుండా వెళ్ళానని బాబున చెప్పుకొచ్చారు. దావోస్‌లో తన ఆరోగ్యం బావుండక నిద్రకూడా లేదని చెప్పారు. ఇదంతా ప్రజల కోసం చేస్తున్నానని, అయినా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications