తిరుపతిలో వేటు పడింది, వైసీపీ ప్రభుత్వంలో ఏం జరిగింది?
గత వైసీపీ ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇష్టం వచ్చినట్లు వ్యవహరించిన ప్రభుత్వ సీనియర్ అధికారులపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొరడా విసిరింది. పెట్రోల్ బంక్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వడానికి ఓ వ్యక్తి నుంచి తన క్యాంపు క్లర్క్ ద్వారా లక్ష రూపాయలు డిమాండ్ చేసిన తిరుపతి ఆర్టీవో నిశాంత్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వెయ్యడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది.
తిరుపతి ఆర్టీవో నిశాంత్ రెడ్డి తో పాటు అప్పటి పుత్తూరు తహసిల్దార్ సోమేశ్వర స్వామి, తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో సూపరెండెంట్ గా పని చేస్తున్న సురేష్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్ఓసీ జారీకి సంబంధిత ఫైల్ ను తిరుపతి కలెక్టర్ కార్యాలయానికి పంపించాలని కోరితే లంచం డిమాండ్ చేశారని కిషోర్ కుమార్ అనే వ్యక్తి సీసీఎల్ఏకి ఫిర్యాదు చేశారు.

ఆ తర్వాత కథ చాలా జరిగింది. కలెక్టర్ సిఫారసు చేశారని రూ 50 వేలు డిస్కౌంట్ ఇస్తున్నామని, మిగిలిన రూ. 50, 000 మా క్యాంప్ క్లర్క్ నరేంద్ర ద్వారా తనకు పంపించాలని తిరుపతి ఆర్డీఓ నిశాంత్ రెడ్డి డిమాండ్ చేశారని పిటిషనర్ కిషోర్ కుమార్ ఆరోపించారు. భూ మార్పిడి కి రూ. 30000 వసూలు చేశారని, ఆ తర్వాత పెట్రోల్ బంక్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వడానికి లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేశారని కిశోర్ కుమార్ అనే వ్యక్తి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు.
అప్పటి పుత్తూరు తహసిల్దార్ గా పనిచేసిన పరమేశ్వరస్వామి రూ. 20000 లంచం తీసుకున్న తర్వాత కూడా సంతకం చేయకుండా ఆ ఫైల్ ఆర్డీవోకి పంపించారని బాధితుడు ఆరోపించారు. తనకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలుసని తాను చెప్పినా వాళ్లు ఏమాత్రం పట్టించుకోలేదని, నీకు ఇష్టం వచ్చినవాళ్లకు చెప్పుకో అంటూ ఆ అధికారులు తనను బెదిరించారని బాధితుడు ఆరోపించారు.
తిరుపతి కలెక్టర్ కార్యాలయం సూపరింటెండెంట్ సురేష్ కుమార్ ఆ ఫైల్ వివిద అధికారులకు పంపించడానికి రూ 20,000 తన దగ్గర లంచం తీసుకున్నారని పిటిషనర్ కిషోర్ కుమార్ ఆరోపించారు. ఈ ఆరోపణలపై ప్రాథమిక విచారణ చేసి ఇదే ఏడాది ఫిబ్రవరి 25వ తేదీన నివేదిక సమర్పించారు. ఈ అధికారులను సస్పెండ్ చేసి కేసు అనిశకు అప్పగించాలని సీసీఎల్ఎ ప్రభుత్వానికి మనవి చేసింది.అయితే అధికారులు తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు మరో అవకాశం ఇచ్చేందుకు కలెక్టర్ కు తరువాత విచారణ బాధ్యతలు అప్పగించారు.
దీనిపై ఎలాంటి నివేదిక రానందున జాయింట్ కలెక్టర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ముగ్గురు అధికారులను సస్పెండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంపై త్వరితగతిన విచారణ జరిపించి నివేదిక సమర్పించాలని అనిశ డీజీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో నిశాంత్ రెడ్డి వివాదాస్పద అధికారిగా పేరు తెచ్చుకున్నాడు.
నిశాంత్ రెడ్డి ఆ పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతూ ఇతర పార్టీల నాయకులను, వ్యాపారులను, చివరికి అధికారులను కూడా ఇబ్బందులకు గురి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చివరికి నిశాంత్ రెడ్డి పై సస్పెన్షన్ వేటు పడడంతో పలు విభాగాల అధికారులు, తిరుపతికి చెందిన కొంతమంది నాయకులు చివరికి న్యాయం గెలిచిందని అంటున్నారు.
-
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!











Click it and Unblock the Notifications