శ్రీవారి సేవలో నారా కుటుంబం: తలనీలాలు సమర్పించిన మనవడు దేవాన్ష్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం 10 గంటలకు పద్మావతి నగర్‌కు చేరుకున్న కుటుంబ సభ్యులు ఏపీ సీఎం మనవడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ కుమారుడు దేవాన్ష్ తలనీలాలు సమర్పించారు.
అనంతరం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి వైకుంఠం నుంచి ఆలయానికి చేరుకుని స్వామివారి సేవలో పాల్గొన్నారు. స్వామివారి దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించి, స్వామివారి తీర్ధప్రసాదాలను అందజేశారు.













Click it and Unblock the Notifications