58ఏళ్ల తర్వాత కర్నూలులో బాబు: శకటాలు(పిక్చర్స్)

కర్నూలు: రాష్ట్ర విభజన అనంతరం తొలిసారి కర్నూలు నగరంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. కాగా, స్వాతంత్య్ర వేడుకలను కర్నూలులో 58 ఏళ్ల తర్వాత మరో మారు నిర్వహించడం విశేషం. నగరంలోని ఎపిఎస్‌పి బెటాలియన్ మైదానంలో శుక్రవారం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన సిఎం చంద్రబాబునాయుడును రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, డిజిపి జెవి రాముడు సాదరంగా ఆహ్వానించారు.

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కవాతులో పాల్గొన్న 13 కంటిజెంట్లను పరిశీలించారు. అనంతరం రాష్ట్రంలోని ప్రత్యేక పోలీసు విభాగాలు, హోంగార్డులు, ఎన్‌సిసి, స్కౌట్స్, గైడ్స్, గ్రీన్‌కార్ఫ్ దళాలు ముఖ్యమంత్రికి గౌరవ వందనం సమర్పించాయి.

వేడుకలు

వేడుకలు

కర్నూలు: రాష్ట్ర విభజన అనంతరం తొలిసారి కర్నూలు నగరంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి.

వేడుకలు

వేడుకలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు.

కవాతు

కవాతు

స్వాతంత్య్ర వేడుకలను కర్నూలులో 58 ఏళ్ల తర్వాత మరో మారు నిర్వహించడం విశేషం.

గౌవర వందనం

గౌవర వందనం

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కవాతులో పాల్గొన్న 13 కంటిజెంట్లను పరిశీలించారు.

అభివాదం

అభివాదం

ఎపిఎస్‌పి బెటాలియన్ మైదానంలో శుక్రవారం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన సిఎం చంద్రబాబునాయుడును రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, డిజిపి జెవి రాముడు సాదరంగా ఆహ్వానించారు.

కవాతు

కవాతు

అనంతరం రాష్ట్రంలోని ప్రత్యేక పోలీసు విభాగాలు, హోంగార్డులు, ఎన్‌సిసి, స్కౌట్స్, గైడ్స్, గ్రీన్‌కార్ఫ్ దళాలు ముఖ్యమంత్రికి గౌరవ వందనం సమర్పించాయి.

శకటాలు

శకటాలు

స్వాతంత్య్ర వేడుకల్లో రాష్ట్ర అభివృద్ది, సంక్షేమ రంగాలపై ప్రదర్శించిన 15 శకటాలు అబ్బురపరిచాయి.

శకటాలు

శకటాలు

వ్యవసాయం సమగ్ర జలపరిరక్షణ, ఉద్యానశాఖ, సంక్షేమవిభాగం, మౌలిక సదుపాయలు శకటాలు ఆకట్టుకున్నాయి.

శకటాలు

శకటాలు

పరిశ్రమలశాఖ, సమాచార సాంకేతిక రంగం, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన మిషన్, పట్టణాభివృద్ధి శాఖ శకటాలు ఆకట్టుకున్నాయి.

శకటాలు

శకటాలు

డ్వాక్రా గ్రూపులు, గ్రామీణ నీటి సరఫరా, పర్యాటక రంగం, అటవీ, ఇంధనశాఖ, గృహ నిర్మాణ సంస్థ శకటాలు ఆకట్టుకున్నాయి.

శకటాలు

శకటాలు

వేడుకల్లో భాగంగా పోలీసు శాఖలకు సంబంధించిన శకటాలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి.

శకటాలు

శకటాలు

వీటిలో డ్వాక్రా గ్రూపు శకటానికి మొదటి, ఇరిగేషన్‌శాఖకు రెండవ, పంచాయితీరాజ్‌శాఖకు మూడవ బహుమతులు దక్కాయి.

శకటాలు

శకటాలు

అయా శాఖలకు చెందిన కార్యదర్శులు సిఎం చంద్రబాబు నుంచి బహుమతులు అందుకున్నారు.

వేడుకలు

వేడుకలు

జెండా ఎగురవేసిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీసులకు పథకాలు అందజేశారు.

వేడుకలు

వేడుకలు

జెండా ఎగురవేసిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు.

వేడుకలు

వేడుకలు

తెలుగువారు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా కష్టపడి అభివృద్ధిలోకి వచ్చే మనస్తత్వం కలవారని కొనియాడారు.

వేడుకలు

వేడుకలు

ఎవరికీ తలవంచరని, శ్రమించడమే వారికి తెలుసునన్నారు. ఒకే రాష్ట్రంలో సంతోషంగా ఉన్న తెలుగువారిని గత ప్రభుత్వం విభజించిన తీరు ఎంతో బాధ కలిగించిందన్నారు.

వేడుకలు

వేడుకలు


రాష్ట్రం నుంచి విడిపోయిన తెలంగాణ అభివృద్ధికి తాను ఏరకంగాను అడ్డుపడలేదన్నారు.

వేడుకలు

వేడుకలు

విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని పూడ్చుకునే ప్రయత్నంలో ఉన్నానని తెలిపారు.

అనంతరం ముఖ్యమంత్రి ప్రజలనుద్ధేశించి ప్రసంగించారు. తెలుగువారు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా కష్టపడి అభివృద్ధిలోకి వచ్చే మనస్తత్వం కలవారని కొనియాడారు. ఎవరికీ తలవంచరని, శ్రమించడమే వారికి తెలుసునన్నారు. ఒకే రాష్ట్రంలో సంతోషంగా ఉన్న తెలుగువారిని గత ప్రభుత్వం విభజించిన తీరు ఎంతో బాధ కలిగించిందన్నారు. రాష్ట్రం నుంచి విడిపోయిన తెలంగాణ అభివృద్ధికి తాను ఏరకంగాను అడ్డుపడలేదన్నారు. విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని పూడ్చుకునే ప్రయత్నంలో ఉన్నానని తెలిపారు.

స్వాతంత్య్ర వేడుకల్లో రాష్ట్ర అభివృద్ది, సంక్షేమ రంగాలపై ప్రదర్శించిన శకటాలు అబ్బురపరిచాయి. వ్యవసాయం సమగ్ర జలపరిరక్షణ, ఉద్యానశాఖ, సంక్షేమవిభాగం, మౌలిక సదుపాయలు, పరిశ్రమలశాఖ, సమాచార సాంకేతిక రంగం, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన మిషన్, పట్టణాభివృద్ధి, డ్వాక్రా గ్రూపులు, గ్రామీణ నీటి సరఫరా, పర్యాటక రంగం, అటవీ, ఇంధనశాఖ, గృహ నిర్మాణ సంస్థ, పోలీసు శాఖలకు సంబంధించిన శకటాలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. వీటిలో డ్వాక్రా గ్రూపు శకటానికి మొదటి, ఇరిగేషన్‌శాఖకు రెండవ, పంచాయితీరాజ్‌శాఖకు మూడవ బహుమతులు దక్కాయి. అయా శాఖలకు చెందిన కార్యదర్శులు సిఎం నుంచి బహుమతులు అందుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+