వాళ్లలా కుప్పిగంతులేయను, ఎప్పుడేం చేస్తానో చూస్తారుగా: జాతీయ రాజకీయాలపై బాబు
Recommended Video

అమరావతి: జాతీయ రాజకీయాలపై అందరిలా తాను కుప్పిగంతులు వేయలేనని ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. భవిష్యత్తులో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేది ప్రాంతీయ పార్టీలే అన్నారు.
ప్రస్తుతం ప్రాంతీయ పక్షాలన్నీ బలోపేతమవుతున్నాయన్నారు. దేశం కోసం అంతా కలిసి పని చేయాల్సి ఉందన్నారు. జాతీయ రాజకీయాల విషయంలో మిగతా వారిలా కుప్పిగంతులు వెయ్యలేనని చెప్పారు. అక్కడి పరిస్థితులు, పరిమితులు తనకు తెలుసన్నారు.

జాతీయ రాజకీయాల్లో ఏం చేస్తానో మీరే చూస్తారు
జాతీయ రాజకీయాల విషయంలో ఎప్పుడేం చేస్తానో ఎలా చేస్తానో మీరే చూస్తారన్నారు. దేశ శ్రేయస్సు కోసం అన్ని పార్టీలు కలిసి పని చేయాల్సి ఉందన్నారు. రాష్ట్రం కోసమే రాజకీయమని, ఎవరితో వ్యక్తిగత తగాదాలు లేవన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలన ఎలా ఉందో ఎన్నికల ఫలితాలే చెబుతున్నాయన్నారు. బీజేపీ చేసిన పనుల వల్ల ఎలాంటి ఫలితాలు వచ్చాయో చూశామన్నారు.

మోడీ ప్రజల విశ్వాసం కోల్పోతున్నారు
ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తర్వాత బీజేపీపై, నరేంద్ర మోడీపై చంద్రబాబు, టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. గురువారం నాటి ఉప ఎన్నికల ఫలితాలపై కూడా వారు స్పందిస్తున్నారు. పార్టీ నేతలతో, మీడియా సమావేశంలో ఆయన ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఓటమి చెందిందంటూ ప్రస్తావిస్తున్నారు. మోడీని ఉప ఎన్నికల్లో ప్రజలు గట్టి దెబ్బ కొట్టారని, ప్రజల విశ్వాసం కోల్పోతున్నారని చెబుతున్నారు.

శివసేన, జేడీయూలు బయటకొస్తాయి
ఎన్డీయేలో శివసేన, జేడీయూలు కూడా మరెన్నో రోజులు ఉండవని చంద్రబాబు జోస్యం చెప్పారు. ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి గట్టి గుణపాఠం అన్నారు. భారత ఓటర్లు చాలా తెలివైన వారని, ఎక్కువ మాటలు చెప్పి పని చేయకుంటే ఇలాగే సమాధానం చెబుతారన్నారు. మనం కూడా పాఠాలు నేర్చుకోవాలన్నారు.

మనం బయటకు వచ్చాకే మోడీని విమర్శించే ధైర్యం వచ్చిందిS
ఎన్డీయే నుంచి శివసేన, ఆ తర్వాత జేడీయు బయటకు వచ్చే అవకాశాలున్నాయని చెప్పారు. మిగిలిన వారు కూడా ఎవరూ ఉండరని చెప్పారు. టీడీపీ ఎన్డీయే నుంచి మనం బయటకు వచ్చిన తర్వాతే మోడీని విమర్శించే ధైర్యం అందరికీ వచ్చిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా గెలవదని చెప్పారు.












Click it and Unblock the Notifications