2019 ఎన్నికల్లో వార్‌ వన్‌సైడే:చంద్రబాబు

Posted By:
Subscribe to Oneindia Telugu

శ్రీకాకుళం: 2019 ఎన్నికల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వార్ వన్‌సైడ్‌ జరగాలని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికలను టిడిపికి అనుకూలంగా ఎన్నికల పోరును మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు చంద్రబాబునాయుడు.

జగన్‌కు షాక్: 6గురు వైసీపీ ఎమ్మెల్యేలు టిడిపిలోకి?

శ్రీకాకుళం జిల్లా తెట్లంగిలో 'ఇంటింటికీ టీడీపీ'ని సోమవారం నాడు చంద్రబాబునాయుడు ప్రారంభించారు.2014 ఎన్నికల్లో 1.5 శాతం ఓట్లను అధికంగా తెచ్చుకుని టీడీపీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. నంద్యాల ఎన్నికల్లో 16 శాతం ఓట్లను తెచ్చుకున్నామని, కాకినాడలోనూ ఘన విజయం సాధించామని చంద్రబాబునాయుడు గుర్తుచేశారు.

 Chandrababu naidu launches Intinti Tdp in Srikakulam

అభివృద్ధికి అడ్డు తగులుతున్న విపక్షాలకు ప్రజలే బుద్ధి చెబుతున్నారని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను గురించి ప్రజలకు వివరించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు నాయకులు, కార్యకర్తలు ముందడుగు వేయాలని కోరారు.

బ్రహ్మనందరెడ్డిపై బాబు షాకింగ్, అదే శిల్పా సోదరులకు దెబ్బ, ముద్రగడ సత్తా తెలిసేది

ఎటువంటి సమస్య ఉన్నా, తనతో చెప్పుకోవచ్చని, ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు తాను కృతనిశ్చయంతో ఉన్నానని అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకుగాను 175 స్థానాల్లోనూ విజయమే లక్ష్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tdp chief Chandrababu naidu launched Intintiki Tdp in Srikakulam district on Monday. In 2019 elections we are planning to win 175 seats said babu

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X