ఎక్కువ కష్టాలొచ్చాయి: హోటల్లో భేటీపై బాబు ఆవేదన, ఢిల్లీకి జగన్
విజయవాడ: రాష్ట్ర విభజనతో నవ్యాంధ్ర ప్రదేశ్‌కు ఎక్కువ కష్టాలు వచ్చాయని, కనీసం సమావేశాలు నిర్వహించుకునేందుకు సరైన వేదిక లేదని, దీంతో హోటల్లో నిర్వహించుకోవాల్సి వస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం కలెక్టర్ల సమావేశంలో అన్నారు. ఆయన కలెక్టర్ల సదస్సులో మాట్లాడారు.
రాష్ట్ర విభజనతో కష్టాలు ఎక్కువయ్యాయని చెప్పారు. కలెక్టర్ల సమావేశం నిర్వహించుకునేందుకు సరైన వేదిక కూడా లేదన్నారు. ఏపీకి రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని కేంద్రం చెప్పిందన్నారు. కేంద్రం హామీలు ఒక్కటొక్కటి నెరవేరుతున్నాయన్నారు. సవాళ్లను అధిగమించి ముందుకు వెళ్తున్నామని చెప్పారు.
రెండంకెల వృద్ధి రేటును కొనసాగించాల్సి ఉందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయని చెప్పారు. విభజన సందర్భంగా కేంద్రం చాలా హామీలు ఇచ్చిందని చెప్పారు. కేంద్రం నుంచి అవసరమైన నిధులు సమీకరిస్తున్నామని చెప్పారు.

రెండు విద్యా సంస్థలకు మినహా అన్నింటికి శంకుస్థాపనలు చేశామని చెప్పారు. అభివృద్ధిలో గత ఏడాది కంటే మెరుగుపడ్డామని చెప్పారు. పట్టిసీమను అనుకున్న దాని కంటే ముందే పూర్తి చేశామని చెప్పారు. విశాఖ నగరం ఇటీవల అభివృద్ధిలో ముందుకు వచ్చిందన్నారు.
గతంలో రెండువందలకు పైగా ర్యాంకులో ఉండే విశాఖ, ఇప్పుడు 50వ స్థానంలోకి వచ్చిందన్నారు. విజయవాడను అదేవిధంగా అభివృద్ధి చేస్తామన్నారు. రెండంకెల వృద్ధి రేటు జరిగితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని చెప్పారు. భూగర్భ జలాలు పెరిగేనే పంటలను కాపాడుకోగలమని చెప్పారు.
కరవును అధిగమించేలా ముందుకు పోతున్నామన్నారు. ఏపీకి ఉన్న ఇబ్బందులను అధిగమించేందుకు కృషి చేస్తున్న వారందరికీ అభినందనలు అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టును అడ్డుకోవాలని ప్రతిపక్షాలు కుట్ర పన్నాయని మండిపడ్డారు. ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు.
జూన్ రెండో వారం నాటికి తాత్కాలిక సచివాలయ నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. గోదావరి పుష్కరాలు, విశాఖ భాగస్వామ్య సదస్సు బాగా నిర్వహించామన్నారు. విశాఖను తక్కువ ఖర్చుతో సుందరనగరంగా తీర్చిదిద్దగలిగామన్నారు. కలెక్టర్ల సదస్సుకు సరైన వేదిక లేక హోటల్లో నిర్వహిస్తున్నామన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వసతులు ఉండాలన్నారు. భూగర్భ జలాలు పెంచే బాధ్యత అధికారులదే అన్నారు. రాయలసీమలో ప్రస్తుతం భూగర్భ జలాలు పెంచుకోగలుగుతున్నామని చెప్పారు. భూగర్భ జలాలు పెరిగితేనే పంటలు కాపాడుకోగలమన్నారు.
చంద్రబాబు నోట డార్విన్ మాట
చంద్రబాబు నోట ప్రఖ్యాత జీవ శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ సిద్ధాంతం వినిపించింది. డార్విన్ ప్రతిపాదించిన 'సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్' సిద్ధాంతం వినిపించారు. విభజన నేపథ్యంలో ఆర్థిక లోటుతో సతమతమవుతున్నామని చెబుతూ... ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రం మనగలగాలంటే (సర్వైవ్) కావాలంటే విపత్కర పరిస్థితులకు తట్టుకుని (ఫిట్టెస్ట్) నిలబడాల్సిందేనన్నారు.
ఇందుకోసం డబుల్ డిజిట్ గ్రోత్ ఒక్కటే మార్గమని చంద్రబాబు కలెక్టర్లకు సూచించారు. విభజన తర్వాత ఆశించిన మేర కంటే మెరుగైన ప్రయాణమే సాగించామన్నారు. ఇకపై అదే దూకుడు కొనసాగించాలన్నారు. ఇప్పటిదాకా నమోదైన డబుల్ డిజిట్ గ్రోత్ ఇకపైనా నమోదైతేనే అభివృద్ధిలో దూసుకు పోగలమన్నారు. చంద్రబాబు నోటి వెంట వినిపించిన 'సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్' తరహా సిద్ధాంతాన్ని కలెక్టర్లు, ఇతర సీనియర్ ఐఏఎస్ అధికారులు ఆసక్తిగా విన్నారు.
15 శాతం వృద్ధి రేటు లక్ష్యం: యనమల
వచ్చే ఏడాది ఆర్థిక సంవత్సరం నాటికి వృద్ధి రేటును పదిహేను శాతం పెంచడమే తమ లక్ష్యమని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సోమవారం చెప్పారు. చంద్రబాబు వల్లే రెండంకెల వృద్ధి రేటు సాధ్యమన్నారు. జిఎస్‌డిపితో వృద్ధి రేటు పెరుగుతుందన్నారు.
మార్చి 5వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయని, మార్చి 10న బడ్జెట్ ప్రవేశ పెడతామని యనమల చెప్పారు. బ్రిటిష్ కాలం నాటి చట్టాలు సరళీకృతం చేశామని, రెవెన్యూ డిపార్టుమెంటులో సంస్కరణలు చేశామని కెఈ కృష్ణమూర్తి అన్నారు.
ఢిల్లీకి జగన్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. ఆయన ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఆయన కలవనున్నారు. కాపు రిజర్వేషన్లు, ఏపీకి ప్రత్యేక హోదా, నిధులు తదితర అంశాలపై చర్చించనున్నారు.
-
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్












Click it and Unblock the Notifications