వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షా కాన్వాయ్‌పై దాడి: చంద్రబాబు హెచ్చరిక, ఆయన నైజమే అదంటూ సోము ఫైర్

|
Google Oneindia TeluguNews

Recommended Video

‘గో బ్యాక్’ అంటూ టీడీపీ అమిత్ షా కాన్వాయ్‌పై దాడి

అమరావతి/తిరుపతి: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్‌పై తిరుమలలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాడికి పాల్పడటంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. దాడులు చేయడం తమ పద్ధతి కాదని అన్నారు.

శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న అనంతరం తిరిగి వెళుతున్న సమయంలో అమిత్ షా కాన్వాయ్‌పై టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో షా కాన్వాయ్‌లోని ఓ వాహనం అద్దం పగిలింది.

తిరుమలలో అమిత్ షాకు చేదు అనుభవం: 'గో బ్యాక్' అంటూ టీడీపీ, కాన్వాయ్‌పై దాడి, ఉద్రిక్తత తిరుమలలో అమిత్ షాకు చేదు అనుభవం: 'గో బ్యాక్' అంటూ టీడీపీ, కాన్వాయ్‌పై దాడి, ఉద్రిక్తత

 చంద్రబాబు హెచ్చరిక

చంద్రబాబు హెచ్చరిక

ఈ నేపథ్యంలో క్రమశిక్షణతో ఉండాలని టీడీపీ నేతలు, శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. మరోసారి ఇలాంటి ఘటనలకు పాల్పడవద్దని హెచ్చరించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

దాడులు బాబు ప్లానే

దాడులు బాబు ప్లానే

కాగా, అమిత్ షా కాన్వాయ్‌పై దాడి ఘటనపై బీజేపీ నేత సోము వీర్రాజు తీవ్రంగా స్పందించారు. ఇదంతా టీడీపీ, చంద్రబాబు నాయుడు ముందుగా చేసుకున్న ప్లాన్ ప్రకారమే జరిగిందని అన్నారు. దాడులను టీడీపీ, బాబు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.

దాడులు మంచిది కాదు

దాడులు మంచిది కాదు


ప్రజాస్వామ్యానికి ఇలాంటి ఘటనలు మంచిది కాదని సోము వీర్రాజు అన్నారు. 21రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఓ బలమైన పార్టీ అధ్యక్షుడిపై ఇలాంటి దాడులు చేస్తారా? అంటూ మండిపడ్డారు. ఈ దాడి పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందన్నారు.

దాడులు చంద్రబాబు నైజమే..

దాడులు చంద్రబాబు నైజమే..

హోదా అంటే జైల్లో పెడతామని, హోదా సంజీవని కాదని, హోదా వల్ల ఏం రాదని అన్న చంద్రబాబు, టీడీపీ.. ఇప్పుడు హోదా కోసం పోరాటం చేయడమేంటని సోమువీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్రంలో ఎదగడాన్ని టీడీపీ, బాబు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. ఈ దాడులు చంద్రబాబు నైజానికి నిదర్శనమని అన్నారు.

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu responded on BJP president Amit shah' convoy attack issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X