లక్ష్మీప్రసన్నకు గ్రూప్-2 ఉద్యోగం: చంద్రబాబు ఆదేశం
తండ్రి దాష్టీకంతో తల్లి, ఇద్దరు తోబుట్టువులను కోల్పోయిన అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన యువతి లక్ష్మీప్రసన్నకు గ్రూప్-2 ఉద్యోగం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించా
మరావతి: తండ్రి దాష్టీకంతో తల్లి, ఇద్దరు తోబుట్టువులను కోల్పోయిన అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన యువతి లక్ష్మీప్రసన్నకు గ్రూప్-2 ఉద్యోగం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు.
ఈనెల 5వ, తేదిన అనంతపురం జిల్లా ముక్తాపురం సభలో లక్ష్మీప్రసన్నకు రూ.20 లక్షల ఆర్థిక సహయం ఇస్తానని చంద్రబాబు ప్రకటించారు. ఆమెకు అండగా నిలుస్తామని సిఎం ధైర్యం చెప్పారు.

సిఎం సూచనమేరకు వెలగపూడిలోని సచివాలయానికి లక్ష్మీప్రసన్నను జేసీ సోదరులు మంగళవారంనాడు తీసుకువచ్చారు. సచివాలయానికి వచ్చిన లక్ష్మీప్రసన్నకు గ్రూప్-2 ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు.
అధైర్యపడకుండా ఆత్మవిశ్వాసంతో ఉండాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మరోసారి సూచించారు. ప్రభుత్వపరంగానే కాకుండా వ్యక్తిగతంగా అండగా నిలుస్తానని చెప్పారు. ఉద్యోగం వచ్చినా ఎంతవరకు చదవినా అంతవరకు చదువుకొనేందుకు అవకాశం కల్పిస్తామని చంద్రబాబు హమీ ఇచ్చారు.
గ్రూప్-2 ఉద్యోగంతో సరిపుచ్చుకోకుండా ఉన్నతస్థాయికి చేరుకోవాలని , ఆరునెలలకు ఓసారి వచ్చిన తనను కలవాలని బాబు లక్ష్మీప్రసన్నకు సూచించారు.












Click it and Unblock the Notifications