అదితి తండ్రికి ఫోన్ చేసిన చంద్రబాబు: బాడీ భోగాపురం వరకు ఎలా? (ఫోటోలు)

అమరావతి: విశాఖపట్నంలో చిన్నారి అదితి మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయవాడలో ఉన్న ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు శుక్రవారం ఉదయం అదితి తండ్రి శ్రీనివాస్‌ను ఫోన్‌ చేసి తన సంతాపాన్ని ప్రకటించారు.

ముక్కుపచ్చలారని ఆ చిన్నారి నిర్జీవంగానే తల్లిదండ్రులను చేరింది. బతికే ఉంటుందని ఇన్ని రోజులు ఆశతో ఎదురుచూసిన ఆ తల్లిదండ్రుల హృదయాల్లో కన్నీటిని నింపింది. దీంతో అదితి కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. కాసేపట్లో అదితి మృతదేహానికి ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించనున్నారు.

పోస్టు మార్టం ముగిశాక అదితి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలోనే తల్లి, నాయనమ్మ ఉన్నారు. వారం రోజుల క్రితం ట్యూషన్‌కు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో అదితి మురుగు కాల్వ దాటుతూ కాల్వలో కొట్టుకుపోయిన అదితి కథ విషాంతమైంది.

ట్యూషన్‌కు వెళ్లివస్తూ గతనెల 24న మురుగునీటి కాలువలో జారిపడి అదితి గల్లంతైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆమె కోసం ప్రభుత్వ యంత్రాంగంతోపాటు కుటుంబసభ్యులు కూడా తీవ్రంగా గాలించారు. అయితే, గురువారం సాయంత్రం చిన్నారి నిర్జీవ దేహం విజయనగరం జిల్లా భోగాపురం మండలం దిబ్బలపాలెం వద్ద బయటపడింది.

అసలు ఎక్కడో విశాఖలోని మురుగు కాల్వలో పడిన అదితి సుమారు 40 కిలోమీటర్ల ఉన్న భోగాపురం మండలం సన్ రే బీచ్ వద్ద బయటపడింది. అదితి మృతదేహం అంతదూరంలో ఎలా కొట్టుకుపోయిందో అంతుబట్టడం లేదు. అయితే దీనికి ఓ కారణం లేకపోలేదంటున్నారు ఎన్‌ఐవో ఇన్‌చార్జి సైంటిస్‌ డాక్టర్‌ వీఎస్‌ఎన్‌ మూర్తి.

సముద్రంలో నెలకొన్న రిప్‌కరెంట్‌ కారణంగానే అదితి మృతదేహం అంతదూరం కొట్టుకుపోయి ఉంటుందని ఎన్‌ఐవో ఇన్‌చార్జి సైంటిస్‌ డాక్టర్‌ వీఎస్‌ఎన్‌ మూర్తి అన్నారు. నైరుతి రుతుపవనాల సీజన్‌లో తూర్పు దిశగా గాలులు వీస్తుండడం వల్ల భోగాపురం వైపు వెళ్లిపోయేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు.

అదితి మృతి: చంద్రబాబు దిగ్భ్రాంతి, తండ్రికి ఫోన్ చేసి పరామర్శ

అదితి మృతి: చంద్రబాబు దిగ్భ్రాంతి, తండ్రికి ఫోన్ చేసి పరామర్శ

విశాఖపట్నం సీతమ్మధారకు చెందిన ఆరేళ్ల అదితి ట్యూషన్‌ నుంచి వస్తూ మురుగునీటి కాలువలో జారిపడిపోయింది. చుట్టుపక్కలవారు చిన్నారి కోసం కాలువలో వెతికారు. కానీ, చీకటి పడటం, అప్పటిదాకా కురిసిన భారీ వర్షానికి కాల్వ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో చిన్నారి జాడ దొరకలేదు. అప్పటి నుంచి జీవీఎంసీ సిబ్బంది జల్లెడ పట్టినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది.

 అదితి మృతి: చంద్రబాబు దిగ్భ్రాంతి, తండ్రికి ఫోన్ చేసి పరామర్శ

అదితి మృతి: చంద్రబాబు దిగ్భ్రాంతి, తండ్రికి ఫోన్ చేసి పరామర్శ

మృతదేహం సముద్రంలోకి వెళ్లిపోయి ఉంటుందనే భావనతో మరపడవలు, నౌకలతో సముద్రంలో అన్వేషించారు. అయినా అదితి ఆచూకీ లభ్యం కాలేదు. సముద్రంలోకి కొట్టుకువెళ్లినా.. లేదా మురుగు కాల్వలో పడినా మృతదేహం లేదా బ్యాగైనా బయటపడేవని, కాబట్టి అదితి బతికే ఉంటుందని ఆమె తలిదండ్రులు ఆశగా ఎదురుచూశారు.

 అదితి మృతి: చంద్రబాబు దిగ్భ్రాంతి, తండ్రికి ఫోన్ చేసి పరామర్శ

అదితి మృతి: చంద్రబాబు దిగ్భ్రాంతి, తండ్రికి ఫోన్ చేసి పరామర్శ

కాలువలో కొట్టుకుపోతున్నపుడు ఎవరైనా రక్షించి డబ్బుకోసం దాచి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవటంతో.. అదృశ్యం కోణంలోనూ దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే దిబ్బలపాలెం తీరంలో బాలిక మృతదేహం కొట్టుకువచ్చినట్టు సమీపంలోని సన్‌రే రిసార్ట్‌ సూపర్‌వైజర్‌ రమణ పోలీసులకు చెప్పారు. చిన్నారి తండ్రి శ్రీనివాసరావుతో విశాఖ పోలీసులు అక్కడికెళ్లి మృతదేహం అదితీదేనని నిర్ధారించారు.

 అదితి మృతి: చంద్రబాబు దిగ్భ్రాంతి, తండ్రికి ఫోన్ చేసి పరామర్శ

అదితి మృతి: చంద్రబాబు దిగ్భ్రాంతి, తండ్రికి ఫోన్ చేసి పరామర్శ

తీరానికి కొట్టుకువచ్చిన అదితీ మృతదేహం గుర్తుపట్టలేనంతగా పాడైపోయింది. తలపై జట్టు, చర్మం పూర్తిగా ఊడిపోయి పుర్రె మాత్రమే మిగిలింది. ముఖంపై చర్మాన్ని చేపలు తినేశాయి. మృతదేహం బాగా ఉబ్బిపోయింది. అదృశ్యం అయినరోజు వేసుకున్న దుస్తులు.. ఉంగరం, చెవిదుద్దులు, మెడలో తాయెత్తు చూసి అదితిగా నిర్ధారించారు.

అదితి మృతి: చంద్రబాబు దిగ్భ్రాంతి, తండ్రికి ఫోన్ చేసి పరామర్శ

అదితి మృతి: చంద్రబాబు దిగ్భ్రాంతి, తండ్రికి ఫోన్ చేసి పరామర్శ

సముద్రంలో నెలకొన్న రిప్‌కరెంట్‌ కారణంగా మృతదేహం అంతదూరం కొట్టుకుపోయి ఉంటుందని ఎన్‌ఐవో ఇన్‌చార్జి సైంటిస్‌ డాక్టర్‌ వీఎస్‌ఎన్‌ మూర్తి అన్నారు. నైరుతి రుతుపవనాల సీజన్‌లో తూర్పు దిశగా గాలులు వీస్తుండడం వల్ల భోగాపురం వైపు వెళ్లిపోయేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+