జగన్-పవన్‌లకు భిన్నంగా..: బిజెపిని కార్నర్ చేసేందుకు బాబు సరికొత్త వ్యూహం

2019 ఎన్నికల్లో బిజెపి కలిసి వచ్చినా, రాకపోయినా సిద్ధంగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. అవసరమైతే బిజెపిని ఇరుకున పెట్టే వ్యూహాన్ని టిడిపి అధినేత, ఇతర నేతలు అనుసరించనున్నారని తెలుస్తోంది

అమరావతి: 2019 ఎన్నికల్లో బిజెపి కలిసి వచ్చినా, రాకపోయినా సిద్ధంగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. అవసరమైతే బిజెపిని ఇరుకున పెట్టే వ్యూహాన్ని టిడిపి అధినేత, ఇతర నేతలు అనుసరించనున్నారని తెలుస్తోంది.

చదవండి: పీకే సర్వే.. పాదయాత్రపై జగన్ రివర్స్ గేర్?: 'భారీ ఆపరేషన్'కు పక్కా స్కెచ్

ఎవరి వ్యూహాలు వారివి

ఎవరి వ్యూహాలు వారివి

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి - బిజెపి కలిసి నడుస్తుందా? అంటే అంటే పార్టీ అధినేతలకే అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బిజెపి, టిడిపిలు ఎవరికి వారు వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. ఒంటరిగా వెళ్లే పరిస్థితి వస్తే.. అనే అనుమానం నేపథ్యంలో బిజెపిని ఇప్పటి నుంచే కిందిస్థాయి నేతలతో ఇరుకున పెట్టేలా చంద్రబాబు ముందుకెళ్లనున్నారు.

Recommended Video

    Chandrababu Naidu unhappy with Modi మోడీపై బాబు అసహనం, జగన్‌కు 20 శాతం ఆఫర్ | Oneindia Telugu
    కేంద్రంపై యుద్ధమే

    కేంద్రంపై యుద్ధమే

    ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఏ విధంగా ముందుకు వెళ్లాలనే విషయం తేలనుంది. కొంతలో కొంత స్పష్టత వచ్చాక కేంద్రంపై మాటల యుద్ధం చేయాలని చంద్రబాబు ఓ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది.

    అలా కార్నర్ చేసే ప్రయత్నం

    అలా కార్నర్ చేసే ప్రయత్నం

    వైసిపి అధినేత జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు ప్రత్యేక హోదాపై ప్రశ్నిస్తున్నారు. హోదాకు సమానమైన ప్యాకేజీ అన్నారని, అది ఏమయిందని కూడా వారు అడుగుతున్నారు. ఇదే అంశంతో బిజెపిని ఇరుకున పెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారని అంటున్నారు.

    జగన్, పవన్ కళ్యాణ్ దారిలో కాకుండా..

    జగన్, పవన్ కళ్యాణ్ దారిలో కాకుండా..

    అధికారంలోకి వచ్చిన కొత్తలో హోదాపై టిడిపి నేతలు మాట్లాడారు. హోదాకు బదులు ప్యాకేజీ అని ప్రకటించిన తర్వాత.. హోదా కంటే ప్యాకేజీ బెట్టర్ అని చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు చెప్పారు. ఈ నేపథ్యంలో 2019లో జగన్, పవన్ కళ్యాణ్ లేవనెత్తే హోదాను తాము లేవనెత్తితే అది తమకే రివర్స్ అవుతుందని, కాబట్టి ప్యాకేజీ, నిధులను చెప్పి బిజెపిని కార్నర్ చేయాలని టిడిపి భావిస్తోంది.

    ప్రజలకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వివరించే ప్రయత్నం

    ప్రజలకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వివరించే ప్రయత్నం

    బిజెపితో తెగతెంపుల పరిస్థితి వస్తే ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి కేంద్రాన్ని టార్గెట్ చేయాలని టిడిపి నేతలు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజల ముందుకు కూడా తీసుకెళ్లనున్నారు. కేంద్రం నుంచి ఇంకా ఎంత రావాలి, పోలవరంకు ఎంత రావాలి, కేంద్రం విడుదల చేసింది ఎంత.. తదితర అంశాలను ప్రజలకు చెప్పాలని టిడిపి కసరత్తు చేస్తోంది.

    ప్యాకేజీ, నిధులు ఓకే అంటేనే..

    ప్యాకేజీ, నిధులు ఓకే అంటేనే..

    ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజీ ఇస్తామంటేనే తాము కేంద్రానికి అనుకూలంగా ఉన్నామని, కానీ ప్యాకేజీ విషయంలో మాట ఇచ్చిందే తప్ప, కేంద్రం అంగీకరించిన నిధుల విడుదలలో తాత్సారం చేస్తోందని, దీంతో ఏపీ ఆర్థికంగా ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కొంటోందని ప్రజలకు చెప్పనున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+